World Championship: అంతిమ్‌కు కాంస్యం
ABN , Publish Date - Sep 19 , 2025 | 06:07 AM
భారత యువ రెజ్లర్ అంతిమ్ పంగల్ ప్రపంచ చాంపియన్‌షి్‌పలో కాంస్య పతకాన్ని సొంతం చేసుకొంది. గురువారం జరిగిన 53 కిలోల కాంస్య పోరులో 9-1తో...
జగ్రెబ్: భారత యువ రెజ్లర్ అంతిమ్ పంగల్ ప్రపంచ చాంపియన్‌షి్‌పలో కాంస్య పతకాన్ని సొంతం చేసుకొంది. గురువారం జరిగిన 53 కిలోల కాంస్య పోరులో అంతిమ్ 9-1తో ఎమ్మా జొన్నా డినైస్ మల్మగ్రెన్ (స్వీడన్)పై గెలిచింది. 21 ఏళ్ల అంతిమ్‌కు ఇది రెండో ప్రపంచ పతకం. 2023 టోర్నీలోనూ ఆమె కాంస్యం నెగ్గింది. దీంతో వినేశ్ ఫొగట్ తర్వాత ప్రపంచ చాంపియన్‌షి్‌పలో రెండు పతకాలు నెగ్గిన భారత రెజ్లర్‌గా అంతిమ్ నిలిచింది. ఇక, మరో భారత రెజ్లర్ మనీష 62 కిలోల విభాగం రెపిచేజ్ రౌండ్‌లో ఓటమిపాలై కాంస్య పోరుకు దూరమైంది.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి