Womens ODI World Cup: మనమ్మాయిలు వచ్చేశారు
ABN , Publish Date - Sep 29 , 2025 | 02:09 AM
వన్డే ప్రపంచ కప్ ఆరంభ మ్యాచ్‌లో తలపడేందుకు భారత, శ్రీలంక మహిళల జట్లు ఆదివారం ఇక్కడకు చేరుకున్నాయి. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న మెగా టోర్నీ ఈనెల 30న...
రేపు ప్రారంభ మ్యాచ్..మహిళల వన్డే వరల్డ్ కప్
గువాహటి : వన్డే ప్రపంచ కప్ ఆరంభ మ్యాచ్‌లో తలపడేందుకు భారత, శ్రీలంక మహిళల జట్లు ఆదివారం ఇక్కడకు చేరుకున్నాయి. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న మెగా టోర్నీ ఈనెల 30న ప్రారంభం కానుంది. బెంగళూరులో వామప్ మ్యాచ్‌లు ముగించుకున్న హర్మన్‌ప్రీత్ కౌర్ సేన సాయంత్రం విచ్చేసింది. తొలి వామప్ మ్యాచ్‌లో భారత జట్టు 153 పరుగుల తేడాతో ఐదుసార్లు చాంపియన్ ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. అయితే వెంటనే పుంజుకున్న హర్మన్ సేన శనివారం న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వామప్ పోటీలో నాలుగు వికెట్ల తేడాతో నెగ్గిన సంగతి తెలిసిందే. ఇక..చమరి ఆటపట్టు సారథ్యంలోని శ్రీలంక మధ్యాహ్నం ఇక్కడ అడుగుపెట్టింది. సోమవారం మధ్యాహ్నం ఆ జట్టు సాధనలో పాల్గొననుంది. భారత జట్టు సాయంత్రం సాధన చేయనుంది. మూడో ప్రపంచ కప్‌లో ఆడుతున్న ఆటపట్టు తన కెప్టెన్సీలో జట్టుకు టైటిల్ అందించాలని పట్టుదలగా ఉంది. అయితే ప్రస్తుత జట్టులోని 15 మందిలో 11 మంది క్రికెటర్లు తొలిసారి ప్రపంచ కప్ బరిలో దిగుతున్నారు.
ఇవి కూడా చదవండి
ఫైనల్‌లో టీమిండియా గెలిస్తే ఎవరికీ అందని రికార్డు.. చరిత్రలో మొదటి జట్టుగా..
ఆసియా కప్ 2025లో చరిత్ర సృష్టించిన కుల్దీప్ యాదవ్..వికెట్ల వేటలో రికార్డ్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి