Ind Vs WI Test: మరి కొద్ది రోజుల్లో భారత్‌తో టెస్టు సిరీస్.. టోర్నీకి కీలక వెస్టిండీస్ ప్లేయర్ దూరం
ABN , Publish Date - Sep 29 , 2025 | 09:28 PM
త్వరలో భారత్‌తో టెస్ట్ సిరీస్ జరగనున్న నేపథ్యంలో వెస్టిండీస్‌కు షాక్ తగిలింది. కీలక పేసర్ అల్జారీ జోసెఫ్ వెన్ను గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకోవడంతో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు అతడి స్థానాన్ని మరో పేసర్ జెడియా బ్లేడ్స్‌తో భర్తీ చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: ఆసియా కప్‌ను ఫుల్లుగా ఎంజాయ్ చేసిన భారతీయులను త్వరలో భారత్ వర్సెస్ వెస్టిండీస్ టెస్టు సిరీస్ ఎంటర్‌టెయిన్ చేయనుంది. అక్టోబర్ 2వ తేదీ నుంచి ఈ రెండు టెస్టుల టోర్నీ ప్రారంభం కానుంది. టోర్నీ కోసం ఇప్పటికే భారత్‌కు చేరుకున్న వెస్టిండీస్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. జట్టుకు కీలక బౌలర్‌గా ఉన్న అల్జారీ జోసెఫ్ వెన్ను గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకున్నారు. రెండు టెస్టులకూ దూరమయ్యాడు. వెస్టిండీస్ క్రికెట్ బోర్డు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది.
అల్జారీ స్థానాన్ని మరో పేసర్ జెడియా బ్లేడ్స్‌ను భర్తీ చేయనున్నాడు. అయితే, జెడియాకు టెస్టు క్రికెట్ ఆడిన అనుభవం లేకపోవడం జట్టును కాస్త కలవరపాటుకు గురి చేస్తోంది. టీ20, వన్డే ఫార్మాట్‌లు రెండింటిల్లో కలిపి అతడు ఏడు మ్యాచుల్లో ఆడి జస్ట్ నాలుగు వికెట్లు తీశాడు. అంతకుముందు మరో పేసర్ షమర్ జోసెఫ్ కూడా గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో అతడి స్థానంలో ఆల్ రౌండర్ జోహన్ లేన్‌ను బోర్డు జట్టులోకి తీసుకుంది.
ఇక అక్టోబర్ 2-6 మధ్య అహ్మదబాద్‌లో తొలి టెస్టు జరగనుంది. అక్టోబర్ 10-14 మధ్య ఢిల్లీ వేదికగా రెండో టెస్టు నిర్వహించనున్నాడు. ఇప్పటికే ఇరు దేశాలు తమ టెస్టు జట్లను ప్రకటించినా వెస్టిండీస్‌కు మాత్రం చివరి నిమిషంలో జట్టు కూర్పును మార్చకతప్పలేదు.
వెస్టిండీస్ టీమ్
రోస్టన్ ఛేజ (కెప్టెన్), జోమెల్ వారికన్ (వైస్ కెప్టెన్), అలిక్ అథనాజ్, జాన్ కాంప్‌బెల్, కెవ్లాన్ ఆండర్సన్, చంద్రపాల్, టాగెనరైన్, జస్టిన్ గ్రీవ్స్, జేడెన్ సీల్స్, ఖారీ పియరీ, ఆండర్సన్ ఫిలిప్, బ్రాండన్ కింగ్, జెడియా బ్లేడ్స్, జోహాన్ లేన్, టెవిన్ ఇమ్లాచ్, షాయ్ హోప్
టీమిండియా జట్టు
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవదుత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, జస్‌ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, నితీశ్, జగదీశన్, సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ, కుల్‌దీప్ యాదవ్
ఇవి కూడా చదవండి
ట్రోఫీ తీసుకెళ్లిపోయిన పీసీబీ చీఫ్.. మండిపడ్డ బీసీసీఐ సెక్రెటరీ
ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అభిషేక్ శర్మకు గిఫ్ట్‌గా భారీ ఎస్‌యూవీ..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి