IND vs WI 1st Test: టాస్ గెలిచిన వెస్టిండీస్.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే..
ABN , Publish Date - Oct 02 , 2025 | 09:39 AM
ఆసియా కప్ విజయోత్సాహం పూర్తిగా చల్లారకముందే టీమిండియా మరో సమరానికి సిద్ధమైంది. దాదాపు పది నెలల విరామం తర్వాత స్వదేశంలో ఓ టెస్ట్ సిరీస్ ఆడుతోంది. వెస్టిండీస్‌తో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడబోతోంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ వేదికగా తొలి టెస్ట్ ప్రారంభమైంది.
ఆసియా కప్ విజయోత్సాహం పూర్తిగా చల్లారకముందే టీమిండియా మరో సమరానికి సిద్ధమైంది. దాదాపు పది నెలల విరామం తర్వాత స్వదేశంలో ఓ టెస్ట్ సిరీస్ ఆడుతోంది (IND vs WI 1st Test 2025). వెస్టిండీస్‌తో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడబోతోంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ వేదికగా ఈ రోజు తొలి టెస్ట్ ప్రారంభమైంది.
టాస్ గెలిచిన వెస్టిండీస్ కెప్టెన్ రోస్టన్ చేజ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో టీమిండియా బౌలింగ్‌కు రెడీ అవుతోంది. ఇద్దరు ప్రధాన పేసర్లు అయిన జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ ఈ మ్యాచ్ ఆడుతున్నారు (India vs West Indies toss).
భారత్: శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్‌దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
వెస్టిండీస్: త్యాగ్‌నారయణ్ చంద్రపాల్, జాన్ క్యాంప్‌బెల్, అలిక్ అథనేజ్, బ్రెండన్ కింగ్, షై హోప్, రోస్టన్ చేజ్, జస్టిన్ గ్రీవ్స్, జొమెల్ వారికన్, ఖేరీ ఫియెరీ, జాన్ లైన్, జైడెన్ సీల్స్
ఇవి కూడా చదవండి..
టాప్ ప్లేస్‌లో అంబానీ.. దేశంలో అత్యంత సంపన్నులు వీరే..
బంగారం ధర తగ్గేదేలే.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
మరిన్ని తాజా వార్తలు కోసం క్లిక్ చేయండి..