IND vs WI 1st Test: సిరాజ్ జోరు.. మొదటి టెస్ట్‌లో విండీస్ తడబాటు..
ABN , Publish Date - Oct 02 , 2025 | 12:59 PM
దాదాపు పది నెలల విరామం తర్వాత స్వదేశంలో టెస్ట్ సిరీస్ ఆడుతున్న టీమిండియా సత్తా చాటుతోంది. వెస్టిండీస్‌తో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా గుజరాత్‌లోని అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో శుభారంభం చేసింది.
దాదాపు పది నెలల విరామం తర్వాత స్వదేశంలో టెస్ట్ సిరీస్ ఆడుతున్న (IND vs WI 1st Test 2025) టీమిండియా సత్తా చాటుతోంది. వెస్టిండీస్‌తో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా గుజరాత్‌లోని అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో శుభారంభం చేసింది. టాస్ గెలిచిన వెస్టిండీస్ కెప్టెన్ రోస్టన్ చేజ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో బౌలింగ్‌కు దిగిన టీమిండియా ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తించింది (India vs West Indies).
హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) నిప్పులు చెరిగే బంతులతో విండీస్ బ్యాటర్లకు వణుకు పుట్టించాడు. ఏకంగా నాలుగు కీలక వికెట్లను పడగొట్టాడు. చంద్రపాల్, అథనాజే, బ్రండన్ కింగ్, రోస్టన్ ఛేజ్ వంటి టాపార్డర్ బ్యాటర్లను పెవిలియన్ చేర్చాడు. జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. విండీస్ బ్యాటర్లలో ఇప్పటివరకు ఒక్కరూ కూడా 30 పరుగులు దాటి చేయలేదు. ప్రస్తుతానికి విండీస్ 32 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 133 పరుగులతో ఆడుతోంది.
ఇవి కూడా చదవండి..
టాప్ ప్లేస్‌లో అంబానీ.. దేశంలో అత్యంత సంపన్నులు వీరే..
బంగారం ధర తగ్గేదేలే.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
మరిన్ని తాజా వార్తలు కోసం క్లిక్ చేయండి..