Asia Cup 2025 Ind Vs Pak: ముగిసిన పాక్ ఇన్నింగ్స్.. భారత్ లక్ష్యం ఎంతంటే..
ABN , Publish Date - Sep 14 , 2025 | 10:02 PM
భారత్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ 9 వికెట్ల నష్టానికి 127 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాక్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది.
ఇంటర్నెట్ డెస్క్: ఆసియా కప్‌లో భాగంగా భారత్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ 9 వికెట్లు కోల్పోయి 127 పరుగులకు పరిమితమైంది. జట్టులో షాహీన్ షాహ్ అఫ్రీదీ 40 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. హార్దిక్ పాండ్యా చివరి ఓవర్‌లో ఏకంగా 16 పరుగులు సమర్పించుకున్నాడు. షాహీన్ ఏకంగా రెండు సిక్సులు బాది పరుగులు పిండుకున్నాడు. కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు తీయగా అక్షర్ పటేల్, బుమ్రా రెండు చొప్పున వికెట్లు తీశారు. హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ తీసుకున్నారు (Asia Cup Ind Vs Pak).
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ తొలి ఓవర్లలోనే కీలక వికెట్ల కోల్పోయి ఆచితూచి ఆడటం ప్రారంభించింది. పాక్ తన వికెట్లు కాపాడుకునే ప్రయత్నంలో ఉండటంతో రన్ రేట్ భారీగా తగ్గింది. ఆ తరువాత భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టడంతో పాక్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. భారత్ బ్యాటింగ్ లైనప్ పటిష్ఠంగా ఉండటంతో గెలుపు కోసం పాక్ పోరాడక తప్పదు.
ఇవి కూడా చదవండి
పాక్‌తో మ్యాచ్.. నల్ల బ్యాండ్స్ ధరించి నిరసన తెలపనున్న టీమిండియా?
నేటి ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ లైవ్ ఎక్కడొస్తుంది.. ఎలా చూడాలంటే..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి