భారత్ X ఆసీస్ పోరు
ABN , Publish Date - May 30 , 2025 | 04:28 AM
మహిళల వన్డే వరల్డ్‌కప్ సన్నాహకంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య 3 మ్యాచ్‌ల సిరీస్ జరుగనుంది. సెప్టెంబరు 14, 17, 20వ తేదీల్లో చెన్నైలో ఈ మ్యాచ్‌లను నిర్వహిస్తారు...
మహిళల 3 వన్డేల సిరీస్ షెడ్యూల్
న్యూఢిల్లీ: మహిళల వన్డే వరల్డ్‌కప్ సన్నాహకంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య 3 మ్యాచ్‌ల సిరీస్ జరుగనుంది. సెప్టెంబరు 14, 17, 20వ తేదీల్లో చెన్నైలో ఈ మ్యాచ్‌లను నిర్వహిస్తారు.
ఆసీస్, దక్షిణాఫ్రికా పురుషుల ‘ఎ’ జట్లు కూడా..: ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత్ ‘ఎ’ జట్టు ఆ తర్వాత స్వదేశంలో బిజీ కానుంది. సెప్టెంబరు-నవంబరు మధ్యలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్లతో తలపడనుంది. ముందుగా ఆసీస్ ‘ఎ’తో సెప్టెంబరు 16-23 మధ్య రెండు.. నాలుగు రోజుల మ్యాచ్‌లు ఆడుతుంది. అనంతరం అదే నెల 30, అక్టోబరు 3, 5తేదీల్లో వన్డే సిరీస్ ఉంటుంది. ఇక దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టుతోనూ నవంబరు 2-9 మధ్య రెండు.. నాలుగు రోజుల మ్యాచ్‌లు.. 13, 16, 19 తేదీల్లో వన్డేలు జరుగుతాయి.
ఇవి కూడా చదవండి..
IPL 2025 PBKS vs RCB: చేతులెత్తేసిన పంజాబ్ బ్యాటర్లు.. ఆర్సీబీ ముందు స్వల్ప టార్గెట్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి