India U19: భారత కుర్రాళ్ల బోణీ
ABN , Publish Date - Sep 22 , 2025 | 05:28 AM
భారత అండర్-19 జట్టు ఆస్ట్రేలియా పర్యటనను విజయంతో ఆరంభించింది. ఆదివారం ఆస్ర్టేలియా అండర్-19 జట్టుతో జరిగిన తొలి వన్డేలో...
ఆసీస్ అండర్-19పై విజయం
బ్రిస్బేన్: భారత అండర్-19 జట్టు ఆస్ట్రేలియా పర్యటనను విజయంతో ఆరంభించింది. ఆదివారం ఆస్ర్టేలియా అండర్-19 జట్టుతో జరిగిన తొలి వన్డేలో భారత్ 7 వికెట్ల తేడాతో నెగ్గింది. ముందుగా ఆసీస్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 225 పరుగులు చేసింది. జేమ్స్ (77), టామ్ హోగన్ (41), స్టీవెన్ హోగన్ (39) రాణించారు. హెనిల్‌కు మూడు.. కనిష్క్, కిషన్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఛేదనలో భారత కుర్రాళ్లు 30.3 ఓవర్లలో 227/3 స్కోరుతో గెలిచారు. అభిగ్యాన్ కుందు (87 నాటౌట్), వేదాంత్ (61 నాటౌట్), వైభవ్ సూర్యవంశీ (38) ఆకట్టుకున్నారు.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి