India Under 19: అదరగొట్టిన వైభవ్ అభిగ్యాన్
ABN , Publish Date - Sep 25 , 2025 | 03:17 AM
యువ బ్యాటర్లు అభిగ్యాన్ కుందు (64 బంతుల్లో 71), వైభవ్ సూర్యవంశీ (68 బంతుల్లో 70), విహాన్ మల్హోత్రా (74 బంతుల్లో 70) చెలరేగడంతో.. ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో...
రెండో వన్డేలో ఆసీస్ అండర్-19 చిత్తు
2-0తో సిరీస్ భారత్ వశం
బ్రిస్బేన్: యువ బ్యాటర్లు అభిగ్యాన్ కుందు (64 బంతుల్లో 71), వైభవ్ సూర్యవంశీ (68 బంతుల్లో 70), విహాన్ మల్హోత్రా (74 బంతుల్లో 70) చెలరేగడంతో.. ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో మూడు వన్డేల సిరీస్‌లో భారత అండర్-19 జట్టు 2-0తో తిరుగులేని స్థితిలో నిలిచింది. బుధవారం జరిగిన రెండో వన్డేలో భారత్ 51 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత భారత్ 49.4 ఓవర్లలో 300 పరుగులకు ఆలౌటైంది. విల్ బైరోమ్ మూడు, యశ్ దేశ్‌ముఖ్ రెండు వికెట్లు పడగొట్టారు. ఛేదనలో ఆసీస్ 47.2 ఓవర్లలో 249 పరుగులకే కుప్పకూలింది. జేడెన్ డ్రేపర్ (107) సెంచరీ వృథా అయింది. ఆయుష్ మాత్రే మూడు, కనిష్క చౌహాన్ రెండు వికెట్లు పడగొట్టారు.
1
ఈ మ్యాచ్‌లో ఆరు సిక్స్‌లు బాదిన వైభవ్ మొత్తం 41 సిక్సర్లతో.. యూత్ వన్డేల్లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన ఉన్ముక్త్ చాంద్ (38 సిక్స్‌లు) రికార్డును అధిగమించాడు.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి