Asia Cup 2025: పాకిస్తాన్‌తోనే భారత్ ఫైనల్
ABN , Publish Date - Sep 26 , 2025 | 03:53 AM
ఆసియాకప్ చరిత్రలో మొట్టమొదటి సారిగా భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్‌కు రంగం సిద్ధం కానుంది. గురువారం సూపర్-4లో బంగ్లాదేశ్‌తో జరిగిన లో స్కోరింగ్ థ్రిల్లర్‌లో పాక్ బౌలర్లు విశేషంగా రాణించారు..
బంగ్లాపై పాక్ ఉత్కంఠ గెలుపు
ఆసియాకప్
దుబాయ్: ఆసియాకప్ చరిత్రలో మొట్టమొదటి సారిగా భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్‌కు రంగం సిద్ధం కానుంది. గురువారం సూపర్-4లో బంగ్లాదేశ్‌తో జరిగిన లో స్కోరింగ్ థ్రిల్లర్‌లో పాక్ బౌలర్లు విశేషంగా రాణించారు. దీంతో 11 రన్స్ తేడాతో నెగ్గిన దాయాది, ఈనెల 28న భారత్‌తో టైటిల్ ఫైట్‌లో తలపడనుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాక్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 135 పరుగులు చేసింది. మహ్మద్ హారిస్ (31) మహ్మద్ నవాజ్ (25), షహీన్ అఫ్రీది (19) రాణించారు. టస్కిన్‌కు మూడు.. రిషాద్, మెహెదీ హసన్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత స్వల్ప ఛేదనలో బంగ్లా బ్యాటర్లు పూర్తిగా తేలిపోయారు. దీంతో 20 ఓవర్లలో 9 వికెట్లకు 124 పరుగులే చేసి ఓడింది. షమీమ్ (30) ఒంటరి పోరాటం చేశాడు. పవర్‌ప్లేలోనే 36/3 స్కోరుతో జట్టు ఓటమి దిశగా పయనించింది. అలాగే వరుస విరామాల్లో పాక్ బౌలర్లు వికెట్లు తీస్తూ ఒత్తిడి పెంచారు. దీంతో స్వల్ప లక్ష్యమే అయినా బంగ్లా గట్టెక్కలేకపోయింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ షహీన్, రౌఫ్‌లకు మూడేసి, సయీమ్‌కు 2 వికెట్లు దక్కాయి.
చివర్లో కోలుకుంది..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాక్‌ను బంగ్లా బౌలర్లు ఏమాత్రం కుదురుకోనీయలేదు. తొలి ఓవర్ నుంచే వికెట్ల పతనం సాగింది. అయితే చివర్లో హారిస్, నవాజ్‌ల ఆటతో కాస్త పరువు నిలుపుకొంది. మొదటి పది ఓవర్లలో పాక్ 46/4 స్కోరుతో తీవ్ర ఇబ్బందుల్లో పడింది. ఈ దశలో వంద రన్స్ కూడా కష్టమే అనిపించింది. కానీ మహ్మద్ హారిస్, నవాజ్‌ల హిట్టింగ్‌తో పరుగులు వేగంగా వచ్చాయి. ఆఖరి ఐదు ఓవర్లలో 52 పరుగులు చేసిన పాక్ పోరాడగలిగే స్కోరందుకుంది.
ఇవి కూడా చదవండి
ఆసియా కప్ 2025లో చరిత్ర సృష్టించిన కుల్దీప్ యాదవ్..వికెట్ల వేటలో రికార్డ్
విండీస్‌తో టెస్ట్ సిరీస్.. జట్టును ప్రకటించిన సెలక్షన్ కమిటీ..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి