CAFA Nations Cup 2025: ఇరాన్ చేతిలో భారత్ ఓటమి
ABN , Publish Date - Sep 02 , 2025 | 04:38 AM
కాఫా నేషన్స్ కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ను విజయంతో ప్రారంభించిన భారత జట్టు.. తమ రెండో మ్యాచ్‌లో మాత్రం తడబడింది. గ్రూప్-బిలో భాగంగా సోమవారం జరిగిన పోరులో 133వ ర్యాంకర్ భారత్ 0-3తో...
కాఫా నేషన్స్ కప్ ఫుట్‌బాల్
హిసార్ (తజకిస్థాన్): కాఫా నేషన్స్ కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ను విజయంతో ప్రారంభించిన భారత జట్టు.. తమ రెండో మ్యాచ్‌లో మాత్రం తడబడింది. గ్రూప్-బిలో భాగంగా సోమవారం జరిగిన పోరులో 133వ ర్యాంకర్ భారత్ 0-3తో 20వ ర్యాంకర్ ఇరాన్ చేతిలో పరాజయం పాలైంది. అమిర్‌హుస్సేన్, అలీ, మెహ్దీ తరెమి తలా గోల్ చేశారు. తమకంటే ఎన్నో రెట్లు మెరుగైన పటిష్ఠ ఇరాన్‌కు భారత్ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో కజకిస్థాన్‌ను భారత్ ఓడించిన సంగతి తెలిసిందే. గ్రూప్‌లో తమ చివరి మ్యాచ్‌ను భారత్ ఈనెల 4న అఫ్ఘానిస్థాన్‌తో ఆడనుంది.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి