Women's World Cup Final: వరల్డ్ కప్ గెలిస్తే.. కళ్లు చెదిరే ప్రైజ్ మనీ
ABN , Publish Date - Nov 02 , 2025 | 08:31 AM
మహిళల వరల్డ్ కప్‌లో విజేతగా నిలిచే టీమ్ కళ్లు చెదిరే ప్రైజ్ అందుకోనుంది. గత ఎడిషన్‌తో పోలిస్తే ఈసారి ఐసీసీ ప్రైజ్ మనీనీ దాదాపు మూడు రెట్ల మేర పెంచింది. దీంతో, విజేత రూ.4.48 మిలియన్ డాలర్లు అందుకోనున్నారు
ఇంటర్నెట్ డెస్క్: భారత్, దక్షిణాఫ్రికా మహిళల వరల్డ్ కప్ ఫైనల్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. చరిత్ర సృష్టించేందుకు భారత్ అడుగు దూరంలో నిలిచింది. అయితే, ఈ టోర్నీ విజేత ఎవరైనప్పటికీ ప్రైజ్ మనీ మాత్రం కళ్లు చెదిరే స్థాయిలో ఉండబోతోంది. వరల్డ్ కప్ విజేత ఏకంగా 4.48 మిలియన్ డాలర్లు (రూ.39.78 కోట్లు) సొంతం చేసుకుంటారు. ఇంతటి మొత్తాన్ని పురుషుల జట్లకు కూడా ఇప్పటివరకూ ఇవ్వలేదు (Women’s World cup 2025 Prize Money).
ఈ టోర్నీ ప్రైజ్ మనీ గురించి ఐసీసీ సెప్టెంబర్‌లో ప్రకటించింది. విజేత, రన్నరప్, ఇతర జట్ల కోసం మొత్తం 13.88 మిలియన్ డాలర్ల (రూ.123 కోట్లు) ప్రైజ్ మనీ పూల్‌ను ఏర్పాటు చేసినట్టు పేర్కొంది. అంతకుముందు, వరల్డ్ కప్ ఎడిషన్‌తో పోలిస్తే ఇది 297 శాతం ఎక్కువ. ఇక విజేతకు ఇచ్చే ప్రైజ్ మనీ కూడా గతంతో పోలిస్తే 239 శాతం మేర పెరిగింది. 2023 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన పురుషల జట్టుకు ఇచ్చిన ప్రైజ్ మనీ కంటే ఇది అధికం కావడం గమనార్హం. ఇక తాజా టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన వారు.. విజేతలు అందుకున్న మొత్తంలో సగాన్ని పారితోషికంగా (2.24 మిలియన్) పొందుతారు.
గ్రూప్ స్టేజ్‌లో పలు విజయాలను అందుకున్న టీమిండియాకు ఇప్పటికే 3.5 లక్షల డాలర్ల నజరానా ఖరారైంది. భారత్ కంటే రెండు విజయాలు అధికంగా నమోదు చేసిన దక్షిణాఫ్రికాకు ఇప్పటివరకూ 4 లక్షల డాలర్లు ఖరారయ్యాయి. టోర్నీలో విజేతగా నిలిస్తే టీమిండియా రూ.42 కోట్ల పైచిలుకు ప్రైజ్ మనీని అందుకుంటుంది.
పురుషులతో సమానంగా మహిళల జట్టుకు పారితోషికం ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించిన విషయం తెలిసిందే. 2024 టీ20 విజేతగా నిలిచిన పురుషుల జట్టుతో సమానంగా మహిళల జట్టుకు ఈసారి పారితోషికం ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది. పురుషుల జట్టు, సపోర్టింగ్ స్టాఫ్‌కు అప్పట్లో ఏకంగా రూ.125 కోట్లు ఇచ్చారు. ఇక భారత మహిళల జట్టుకు ఇది మూడో ప్రపంచకప్ ఫైనల్ కాగా దక్షిణాఫ్రికా జట్టు తొలిసారి ఫైనల్‌లో తలపడుతోంది.
ఇవి కూడా చదవండి
ఆసుపత్రి నుంచి శ్రేయాస్ డిశ్చార్జ్
రిటైర్‌మెంట్ ప్రకటించిన బోపన్న
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి