Shreyas Iyer Discharged: ఆసుపత్రి నుంచి శ్రేయాస్ డిశ్చార్జ్
ABN , Publish Date - Nov 02 , 2025 | 03:33 AM
భారత వైస్-కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ సిడ్నీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఆస్ట్రేలియాతో గతనెల 25న జరిగిన మూడో వన్డేలో క్యాచ్ పట్టే యత్నంలో...
న్యూఢిల్లీ: భారత వైస్-కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ సిడ్నీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఆస్ట్రేలియాతో గతనెల 25న జరిగిన మూడో వన్డేలో క్యాచ్ పట్టే యత్నంలో అయ్యర్ గాయపడిన సంగతి తెలిసిందే. పొత్తి కడుపులో గాయంతో అంతర్గతంగా రక్తస్రావం అయ్యింది. అందుకు చిన్నపాటి శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం అయ్యర్ పూర్తిగా కోలుకోవడంతో ఆసుపత్రి నుంచి శనివారం డిశ్చార్జ్ అయ్యాడని బీసీసీఐ తెలిపింది. ప్రయాణం చేసేందుకు అనువుగా ఫిట్‌నెస్ సాధిస్తే అతడు భారత్ వచ్చేస్తాడని పేర్కొంది. కాగా, శ్రేయాస్ దాదాపు రెండు నెలలు ఆటకు దూరం కానున్నాడు.
ఈ వార్తలు కూడా చదవండి...
కాశీబుగ్గ ఘటనపై పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి
షాకింగ్ ఘటన... జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలిపై అత్యాచారం
Read Latest AP News And Telugu News