2026 Asian Games: పతకం తెచ్చే సత్తా ఉంటేనే
ABN , Publish Date - Sep 25 , 2025 | 03:10 AM
వచ్చే ఆసియా క్రీడల (2026)కు కఠినమైన ఎంపిక ప్రక్రియను కేంద్రం ప్రకటించింది. పతకాలు సాధించే సత్తా కలిగిన అథ్లెట్లనే ఎంపికలో పరిగణిస్తామని క్రీడా శాఖ స్పష్టంజేసింది. ఈ క్రమంలో...
2026 ఆసియా క్రీడలకు కఠిన ఎంపిక ప్రమాణాలు
న్యూఢిల్లీ: వచ్చే ఆసియా క్రీడల (2026)కు కఠినమైన ఎంపిక ప్రక్రియను కేంద్రం ప్రకటించింది. పతకాలు సాధించే సత్తా కలిగిన అథ్లెట్లనే ఎంపికలో పరిగణిస్తామని క్రీడా శాఖ స్పష్టంజేసింది. ఈ క్రమంలో ఆసియా ర్యాంకింగ్స్‌ను ప్రామాణికంగా తీసుకుంటారని పేర్కొంది. అలాగే ప్రభుత్వంపై భారం పడకున్నా..అంటే అథ్లెట్లు సొంత ఖర్చులతో కోచ్‌లు, ఇతర సహాయ సిబ్బందిని తీసుకువెళ్లడానికి కూడా అనుమతించబోమని తెలిపింది. ఈమేరకు ఎంపిక ప్రక్రియకు సంబంధించిన ఐదు పేజీల డాక్యుమెంట్‌ను క్రీడా శాఖ తన వెబ్‌సైట్‌లో బుధవారం అప్‌లోడ్ చేసింది. వ్యక్తిగత క్రీడాంశాల్లో తొలి ఆరు ర్యాంకుల్లో, అలాగే టీమ్ క్రీడాంశాల్లో భారత జట్టు ఎనిమిదో ర్యాంకులోపు ఉంటేనే ఆసియా క్రీడల ఎంపికకు ఆయా క్రీడా సమాఖ్యలు సిఫారసు చేయాల్సి ఉంటుంది. ఆసియా క్రీడలు వచ్చే ఏడాది సెప్టెంబరు 19 నుంచి అక్టోబరు నాలుగు వరకు జపాన్‌లోని నగోయాలో జరగనున్నాయి. కామన్వెల్త్ క్రీడలు (ఆగస్టు 2026), సహా ఆసియా స్థాయిలో జరిగే ఇతర క్రీడలకూ ఇదే విధానం వర్తిస్తుందని వెల్లడించింది.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి