Share News

India Set to Win Series: ఇక లాంఛనమే

ABN , Publish Date - Oct 14 , 2025 | 04:48 AM

వెస్టిండీ్‌సతో రెండు టెస్టుల సిరీ్‌సను టీమిండియా క్లీన్‌స్వీ్‌ప చేయడం ఇక లాంఛనమే. కానీ రెండో టెస్టులో విండీస్‌ బ్యాటర్ల పట్టువదలని పోరాటంతో సిరీ్‌సలో తొలిసారిగా ఆట ఐదో రోజుకు...

India Set to Win Series: ఇక లాంఛనమే

విజయానికి 58 పరుగుల దూరంలో గిల్‌ సేన

భారత్‌ లక్ష్యం 121.. ప్రస్తుతం 63/1

విండీస్‌ రెండో ఇన్నింగ్స్‌ 390

క్యాంప్‌బెల్‌, హోప్‌ శతకాలు

న్యూఢిల్లీ: వెస్టిండీ్‌సతో రెండు టెస్టుల సిరీ్‌సను టీమిండియా క్లీన్‌స్వీ్‌ప చేయడం ఇక లాంఛనమే. కానీ రెండో టెస్టులో విండీస్‌ బ్యాటర్ల పట్టువదలని పోరాటంతో సిరీ్‌సలో తొలిసారిగా ఆట ఐదో రోజుకు చేరడం గమనార్హం. అటు 121 పరుగుల లక్ష్య ఛేదనకు సోమవారం చివరి సెషన్‌లో బరిలోకి దిగిన భారత్‌ ఆట ముగిసేసరికి రెండో ఇన్నింగ్స్‌లో 63/1 స్కోరుతో ఉంది. క్రీజులో సాయి సుదర్శన్‌ (30), రాహుల్‌ (25) ఉన్నారు. ఇక, విజయానికి భారత్‌ కేవలం 58 పరుగుల దూరంలో ఉంది. దీంతో మంగళవారం తొలి సెషన్‌లోనే మ్యాచ్‌ ముగిసే చాన్సుంది. యశస్వీ జైస్వాల్‌ (8) రెండో ఓవర్‌లోనే వెనుదిరిగాడు. అయితే అంతకుముందు విండీస్‌ తమ ఫాలోఆన్‌లో అంచనాలకు మించి చివరి వికెట్‌ వరకు పోరాడింది. క్యాంప్‌బెల్‌ (115) కెరీర్‌లో తొలి శతకం నమోదు చేయగా.. అటు షాయ్‌ హోప్‌ (103) ఎనిమిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టెస్టుల్లో సెంచరీని అందుకోవడం విశేషం. వీరిద్దరి ఆటతీరుతో విండీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో 390 పరుగులకు ఆలౌటైంది. గ్రీవ్స్‌ (50 నాటౌట్‌), చేజ్‌ (40), సీల్స్‌ (32) రాణించి విండీ్‌సకు 120 పరుగుల ఆధిక్యాన్ని అందించారు. బుమ్రా, కుల్దీప్‌ చెరో 3.. సిరాజ్‌ 2 వికెట్లు తీశారు.


శతకాల మోత: ఓవర్‌నైట్‌ స్కోరు 173/2తో నాలుగో రోజు ఆరంభించిన విండీ్‌సను వీలైనంత త్వరగా ఆలౌట్‌ చేద్దామనుకున్న భారత బౌలర్లకు అవకాశం దక్కలేదు. ఈ సెషనల్‌లో ఒక వికెట్‌ను మాత్రమే తీయగలిగారు. తొలి గంట ఆటలో క్యాంప్‌బెల్‌, హోప్‌ ఇబ్బంది లేకుండా ఆడారు. స్పిన్నర్లు కూడా బంతిని టర్న్‌ చేయలేకపోయారు. ఓ సిక్సర్‌తో క్యాంప్‌బెల్‌ సెంచరీని అందుకున్నాడు. చివరకు మూడో వికెట్‌కు 177 పరుగుల భారీ భాగస్వామ్యం అందాక క్యాంప్‌బెల్‌ను జడేజా అవుట్‌ చేశాడు. ఆ తర్వాత చేజ్‌ కూడా దీటుగా ఆడాడు. లంచ్‌ బ్రేక్‌ అనంతరం హోప్‌ కూడా సెంచరీ పూర్తి చేశాడు. ఆ వెంటనే సిరాజ్‌ రెండో కొత్త బంతితో అతడిని బౌల్డ్‌ చేయగా..కుల్దీప్‌ ఒకే ఓవర్‌లో చేజ్‌, పియర్‌ (0)లను అవుట్‌ చేశాడు. టెయిలెండర్లను బుమ్రా దెబ్బతీసినప్పటికీ.. ఆఖరి వికెట్‌కు గ్రీవ్స్‌, సీల్స్‌ మాత్రం పట్టు వీడలేదు. 311 రన్స్‌కే 9 వికెట్లు కోల్పోయిన దశలో.. ఈ ఇద్దరూ క్రీజులో పాతుకుపోయి 361/9 స్కోరుతో మ్యాచ్‌ను ఆఖరి సెషన్‌కు తీసుకెళ్లారు. మరో 29 పరుగులు జోడించాక సీల్స్‌ను బుమ్రా అవుట్‌ చేయడంతో పదో వికెట్‌కు 79 పరుగుల భాగస్వామ్యం ముగిసినట్టయ్యింది. వీరి పోరాటం లేకపోయుంటే మ్యాచ్‌ సోమవారమే ముగిసేది.

స్కోరుబోర్డు

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 518/5 డిక్లేర్‌; వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌: 248 ఆలౌట్‌;

వెస్టిండీస్‌ రెండో ఇన్నింగ్స్‌: క్యాంప్‌బెల్‌ (ఎల్బీ) జడేజా 115, చందర్‌పాల్‌ (సి) గిల్‌ (బి) సిరాజ్‌ 10, అథనజె (బి) సుందర్‌ 7, హోప్‌ (బి) సిరాజ్‌ 103, చేజ్‌ (సి సబ్‌) దేవ్‌దత్‌ (బి) కుల్దీప్‌ 40, ఇమ్లాచ్‌ (ఎల్బీ) కుల్దీప్‌ 12, గ్రీవ్స్‌ (నాటౌట్‌) 50, పియర్‌ (సి) నితీశ్‌ (బి) కుల్దీప్‌ 0, వారికన్‌ (బి) బుమ్రా 3, ఫిలిప్‌ (సి) జురెల్‌ (బి) బుమ్రా 2, సీల్స్‌ (సి) సుందర్‌ (బి) బుమ్రా 32; ఎక్స్‌ట్రాలు: 16; మొత్తం: 118.5 ఓవర్లలో 390 ఆలౌట్‌. వికెట్ల పతనం: 1-17, 2-35, 3-212, 4-271, 5-293, 6-298, 7-298, 8-307, 9-311, 10-390. బౌలింగ్‌: సిరాజ్‌ 15-3-43-2, జడేజా 33-10-102-1, సుందర్‌ 23-3-80-1, కుల్దీప్‌ 29-4-104-3, బుమ్రా 17.5-5-44-3, జైస్వాల్‌ 1-0-3-0.


భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (సి) ఫిలిప్‌ (బి) వారికన్‌ 8, రాహుల్‌ (బ్యాటింగ్‌) 25, సాయి సుదర్శన్‌ (బ్యాటింగ్‌) 30;

ఎక్స్‌ట్రాలు: 0; మొత్తం: 18 ఓవర్లలో 63/1. వికెట్‌ పతనం: 1-9 .బౌలింగ్‌: సీల్స్‌ 3-0-14-0; వారికన్‌ 7-1-15-1; పియర్‌ 6-0-24-0; చేజ్‌ 2-0-10-0.

5-Sports.jpg

సిరాజ్‌కు వడదెబ్బ

అధిక వేడి, తేమ కారణంగా భారత పేసర్‌ సిరాజ్‌ మైదానంలో తీవ్ర అలసటకు గురయ్యాడు. నాలుగో రోజు రెండో సెషన్‌లో అతను వరుసగా ఆరు ఓవర్లు వేయడంతో నీరసించాడు. దీంతో వెంటనే డగౌట్‌కు వెళ్లిన సిరాజ్‌కు సహాయక సిబ్బంది అతడి తలపై ఐస్‌ ప్యాక్‌ పెట్టి శరీర ఉష్ణోగ్రతను తగ్గించే ప్రయత్నం చేశారు. ఫిజియో థెరపిస్ట్‌ సిరాజ్‌ కాలికి మసాజ్‌ చేశాడు. ఆ తర్వాత సిరాజ్‌ బౌలింగ్‌కు దిగలేదు. అయితే ఇదంతా గమనించిన కామెంటేటర్‌ దినేశ్‌ కార్తీక్‌.. పేసర్లకు మహరాజా తరహా చికిత్స లభిస్తుంటుందని సరదాగా వ్యాఖ్యానించాడు.

1

ఈ ఏడాది టెస్టుల్లో ఎక్కువ వికెట్లు (8 టెస్టుల్లో 37) తీసిన బౌలర్‌గా సిరాజ్‌. జింబాబ్వే పేసర్‌ ముజరబాని (36)ని అధిగమించాడు.

ఈ వార్తలు కూడా చదవండి...

నాపై కుట్రలు చేశారు... వినుత కోట ఎమోషనల్

ఏపీ పర్యాటక రంగానికి జాతీయ గుర్తింపు దిశగా అడుగులు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 14 , 2025 | 04:48 AM