Ro-Ko farewell: ఇదే చివరి ఛాన్స్.. సిడ్నీలో అభిమానుల కళ్లన్నీ రోహిత్, కోహ్లీ పైనే..
ABN , Publish Date - Oct 25 , 2025 | 07:10 AM
ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా చివరి వన్డే ఈ రోజు (శనివారం) జరగబోతోంది. తొలి రెండు మ్యాచ్‌లలో ఓటమి పాలైన టీమిండియా సిరీస్‌ను కోల్పోయింది. ఇక, క్లీన్ స్వీప్ అవమానం నుంచి తప్పించుకోవడం ఒకటే ఇప్పుడు టీమిండియా ముందున్న లక్ష్యం.
ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా చివరి వన్డే ఈ రోజు (శనివారం) జరగబోతోంది. తొలి రెండు మ్యాచ్‌లలో ఓటమి పాలైన టీమిండియా సిరీస్‌ను కోల్పోయింది. ఇక, క్లీన్ స్వీప్ అవమానం నుంచి తప్పించుకోవడం ఒకటే ఇప్పుడు టీమిండియా ముందున్న లక్ష్యం. ఈ నేపథ్యంలో ఈ రోజు సిడ్నీలో మూడో వన్డే జరగబోతోంది. ఈ మ్యాచ్ ఆస్ట్రేలియా గడ్డపై సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకీ దాదాపు చివరి వన్డే మ్యాచ్ అయ్యే అవకాశం ఉంది (India vs Australia 2025).
రాబోయే రెండేళ్లలో ఆస్ట్రేలియాలో టీమిండియాకు మరో వన్డే సిరీస్ లేదు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు దిగ్గజాలకు ఇదే చివరి ఆస్ట్రేలియా పర్యటన కావొచ్చు (Rohit Sharma farewell). దీంతో వీరిద్దరూ కలిసి భారత్‌ను వైట్‌వాష్ నుంచి కాపాడతారో, లేదో చూడాలి. ఇప్పటికే సిరీస్ కోల్పోయిన భారత జట్టు, ఆస్ట్రేలియా చేతిలో మొత్తం మ్యాచ్‌లలో ఓడిపోయే అవమానం నుంచి తప్పించుకోవాలంటే ఈ ఇద్దరు సీనియర్లు తమ ప్రతాపం చూపించాల్సిందే. దీంతో సిడ్నీలో అభిమానుల కళ్లన్నీ రోహిత్, కోహ్లీపైనే ఉన్నాయి (Virat Kohli last tour).
సిడ్నీ మైదానం భారత్‌కు అత్యంత కఠినమైన సవాలు విసరనుంది. ఎందుకంటే గత తొమ్మిది సంవత్సరాలుగా భారత జట్టు ఈ మైదానంలో ఒక్క వన్డే మ్యాచ్ కూడా గెలవలేదు (cricket whitewash). గత మూడు వన్డే మ్యాచ్‌లలోనూ టీమిండియాను ఓటమే పలకరించింది. మరి, ఈ రోజైనా ఆ సెంటిమెంట్‌ను భారత్ తుడిచిపెట్టి విజయం సాధిస్తేనే క్లీన్‌స్వీప్ ప్రమాదం నుంచి తప్పించుకునే వీలుంటుంది.
ఇవి కూడా చదవండి..
IND VS AUS: రెండో వన్డేలోనూ భారత్ ఓటమి
Virat Kohli Emotional: అడిలైడ్ మ్యాచ్‌లో భావోద్వేగానికి గురైన విరాట్ కోహ్లీ