Share News

Asia Cup Hockey 2025: సూపర్‌ 4కు భారత్‌

ABN , Publish Date - Sep 01 , 2025 | 02:34 AM

కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ రెండు గోల్స్‌తో అదరగొట్టడంతో.. ఆసియాకప్‌ హాకీలో భారత జట్టు వరుసగా రెండో విజయంతో సూపర్‌-4 బెర్త్‌ను ఖరారు చేసుకొంది. పూల్‌-ఎలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 3-2తో జపాన్‌ను ఓడించింది...

Asia Cup Hockey 2025: సూపర్‌ 4కు భారత్‌

ఫ హర్మన్‌ప్రీత్‌ డబుల్‌

ఫ 3-2తో జపాన్‌పై గెలుపు

ఫ ఆసియాకప్‌ హాకీ

రాజ్‌గిర్‌ (బిహార్‌): కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ రెండు గోల్స్‌తో అదరగొట్టడంతో.. ఆసియాకప్‌ హాకీలో భారత జట్టు వరుసగా రెండో విజయంతో సూపర్‌-4 బెర్త్‌ను ఖరారు చేసుకొంది. పూల్‌-ఎలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 3-2తో జపాన్‌ను ఓడించింది. డ్రాగ్‌ఫ్లికర్‌ హర్మన్‌ప్రీత్‌ (5వ, 46వ నిమిషం) రెండు పెనాల్టీ కార్నర్‌లను గోల్స్‌గా మలిచాడు. 4వ నిమిషంలో మన్‌దీ్‌ప ఫీల్డ్‌ గోల్‌తో భారత్‌కు తొలి గోల్‌ అందించాడు. జపాన్‌ తరఫున కోసి కవాబే (38వ, 58వ) రెండు గోల్స్‌ సాధించాడు. తొలి మ్యాచ్‌లో చైనాపై గెలిచిన భారత్‌ మొత్తం ఆరు పాయింట్లతో పూల్‌-ఎలో అగ్రస్థానంలో నిలిచింది. సోమవారం లీగ్‌ ఆఖరి మ్యాచ్‌లో కజకిస్థాన్‌తో భారత్‌ తలపడనుంది. ఇక, సూపర్‌-4లో స్థానం కోసం జపాన్‌, చైనా అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇదే గ్రూప్‌లో జరిగిన మరో మ్యాచ్‌లో చైనా 13-1తో కజకిస్థాన్‌ను చిత్తు చేసింది.

ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 01 , 2025 | 02:34 AM