Share News

IND VS AUS: ముగిసిన భారత్ బ్యాటింగ్..స్కోర్ ఎంతంటే?

ABN , Publish Date - Oct 19 , 2025 | 02:53 PM

పెర్త్ వేదికగా ప్రారంభమైన తొలి వన్డే మ్యాచ్ లో భారత్ స్వల్ప స్కోర్ మాత్రమే చేసింది. వర్షం కారణంగా 26 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్ లో ఆసీస్ ముందు స్వల్ప టార్గెట్ ను ఉంచింది.

IND VS AUS:  ముగిసిన భారత్ బ్యాటింగ్..స్కోర్ ఎంతంటే?
India Score

క్రికెట్ న్యూస్: పెర్త్ వేదికగా ప్రారంభమైన తొలి వన్డే మ్యాచ్ లో భారత్ స్వల్ప స్కోర్ మాత్రమే చేసింది. వర్షం కారణంగా 26 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్ లో ఆసీస్ ముందు స్వల్ప టార్గెట్ ను ఉంచింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ దిగిన భారత్ నిర్ణీత 26 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్(38), అక్షర్ పటేల్(31) రాణించడంతో ఆ మాత్రం స్కోర్ అయినా భారత్ చేయగలిగింది. సుదీర్ఘ విరామం తర్వాత వన్డేల్లోకి రీఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ నిరాశపర్చారు.

రోహిత్ శర్మ కేవలం 8 పరుగులే చేసి ఔట్ కాగా.. కోహ్లీ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. దీంతో వీరిపై ఎన్నో అంచనాలు పెట్టుకున్న అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. ఇక శుభ్ మన్ గిల్, శ్రేయస్ అయ్యార్లు కూడా ఆశించిన మేర రాణించలేదు. కాసేపు అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ స్కోర్ బోర్డును నెమ్మదిగా కదిలించారు. 31 పరుగుల వద్ద అక్షర్, 38 పరుగుల వద్ద రాహుల్ ఔటయ్యారు. ఇక ఆసీస్ బౌలర్లలో హాజెల్‌వుడ్, మిచెల్ ఓవెన్,మాథ్యూ కున్హెమన్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. మిచెల్ స్టార్క్, నాథన్ ఎల్లిస్ చెరో ఒక వికెట్ తీశారు.

Updated Date - Oct 19 , 2025 | 02:53 PM