Share News

Asia Cricket Cup 2025: టాస్‌కు 4 నిమిషాల ముందు

ABN , Publish Date - Sep 20 , 2025 | 05:43 AM

పాకిస్థాన్‌తో గత ఆదివారం జరిగిన ఆసియా కప్‌ మ్యాచ్‌ సందర్భంగా ఆ జట్టుతో టీమిండియా క్రికెటర్లు కరచాలనం చేయకపోవడం పెద్ద దుమారం రేపింది. కెప్టెన్లు...

 Asia Cricket Cup 2025: టాస్‌కు 4 నిమిషాల ముందు

దుబాయ్‌: పాకిస్థాన్‌తో గత ఆదివారం జరిగిన ఆసియా కప్‌ మ్యాచ్‌ సందర్భంగా ఆ జట్టుతో టీమిండియా క్రికెటర్లు కరచాలనం చేయకపోవడం పెద్ద దుమారం రేపింది. కెప్టెన్లు సూర్యకుమార్‌, ఆఘా కరచాలనం చేసుకోరనే సమాచారం టాస్‌కు నాలుగు నిమిషాల ముందు మాత్రమే పైక్రా్‌ఫ్టకు అందిందట! ఈ విషయాన్ని ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ) వేదిక మేనేజర్‌ ఆండీకి చేరవేశాడట. టాస్‌ సందర్భంగా ఒకవేళ సల్మాన్‌ భారత సారథికి షేక్‌హ్యాండ్‌ ఇవ్వబోతే.. అందుకు సూర్యకుమార్‌ తిరస్కరిస్తే పాకిస్థాన్‌ కెప్టెన్‌కు అది ఇబ్బందిగా ఉంటుందని పైక్రాఫ్ట్‌ భావించాడు. దాంతో సూర్యకుమార్‌తో కరచాలనం ఉండబోదని ఆఘాకు ఆండీ చెప్పాడు. కానీ పీసీబీ వేరేగా అర్థం చేసుకొని పైక్రా్‌ఫ్టపై విమర్శలు చేసింది.

ఇవి కూడా చదవండి

పైక్రాఫ్ క్షమాపణ వ్యవహారం.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన పాక్

మ్యాచ్ రెఫరీ యాండీ పైక్రాఫ్ట్ క్షమాపణ చెప్పారు: పీసీబీ

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 20 , 2025 | 05:43 AM