Share News

Ad Rates Ind Vs Pak: ఆసియా కప్.. ఆకాశాన్నంటుతున్న ప్రకటనల రేట్లు.. రికార్డ్స్ బ్రేక్

ABN , Publish Date - Aug 18 , 2025 | 01:55 PM

ఉత్కంఠ భరిత ఆసియా టోర్నీకి సంబంధించి భారత్‌లో ప్రసార హక్కులు దక్కించుకున్న సోనీ టీవీ తాజాగా ప్రకటన రేట్ల వివరాలు విడుదల చేసింది. ఈ మ్యాచులకున్న డిమాండ్‌కు అద్దంపట్టేలా ప్రకటన రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి.

Ad Rates Ind Vs Pak: ఆసియా కప్.. ఆకాశాన్నంటుతున్న ప్రకటనల రేట్లు.. రికార్డ్స్ బ్రేక్
India Pakistan Asia Cup Ad Rates

ఇంటర్నెట్ డెస్క్: వచ్చే నెలలో జరగనున్న ఆసియా కప్‌లో భారత్, పాక్‌లు తలపడనున్నాయి. సెప్టెంబర్‌ 14న దుబాయ్ స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో ఉత్కంఠ పీక్స్‌కు చేరుకుంది. మరోవైపు, భారత్‌లో ఆసియా కప్‌కు సంబంధించి లైవ్ టెలికాస్ట్, స్ట్రీమింగ్ రైట్స్‌ను సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌ల సందర్భంగా ప్రచారం కోసం ప్రకటనలు ఇవ్వాలనుకునే వారి కోసం సంస్థ యాడ్ రేట్ కార్డును కూడా విడుదల చేసినట్టు తెలుస్తోంది. మ్యాచ్‌ సమయంలో 10 సెకెన్ల నిడివి ఉన్న టీవీ యాడ్‌కు రూ.16 లక్షల ధరను నిర్ణయించిందన్న వార్త వైరల్‌‌గా మారింది. యాడ్ ధరలు ఈ రేంజ్‌లో ఉన్నాయంటే ఈ మ్యాచ్‌కు ఆదరణ ఎంతలా ఉండబోతోందో తెలుస్తోందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.


జాతీయ మీడియా కథనాల ప్రకారం, యాడ్ రేట్స్ ఎలా ఉన్నాయంటే..

టీవీ యాడ్ ప్యాకేజీలు

  • కోప్రెజెంటింగ్ ప్రార్ట్‌నర్‌షిప్: రూ.18 కోట్లు

  • అసోసియేట్ పార్ట్‌నర్‌షిప్: రూ.13 కోట్లు

  • స్పాట్ బై ప్యాకేజీ: 10 సెకెన్లకు రూ.16 లక్షు లేదా 4.48 కోట్లు

సోనీ లైవ్‌పై డిజిటల్ డీల్స్

  • కోప్రజెంటింగ్ అండ్ హైలైట్స్ పార్ట్‌నర్: రూ.30 కోట్లు

  • కోపవర్డ్ బై ప్యాకేజీ: రూ.18 కోట్లు

ఫార్మాట్‌‌ల వారీగా రేట్స్ ఇవీ

  • ప్రీ రోల్స్: 10 సెకెన్లకు రూ.275 (భారత్ మ్యాచ్‌లకు రూ.500. భారత్ పాక్ మ్యాచులకు రూ.750)

  • మిడ్ రోల్స్: రూ.225 (భారత్ మ్యాచ్‌లకు రూ.400, ఇండియా పాక్ మ్యాచ్‌లకు రూ.700)

  • కనక్టెటెడ్ టీవీ యాడ్స్: రూ.450 (భారత మ్యాచులకు రూ.800, ఇండియా పాక్ మ్యాచులకు రూ.1200)


ఇక సెప్టెంబర్ 9 నుంచి 28వ తేదీ వరకూ ఆసియా కప్ టోర్నీ జరగనుంది. ఇందులో భాగంగా దుబాయ్, అబుదాబీ వేదికల్లో 8 జట్ల మధ్య మొత్తం 19 టీ20 మ్యాచులు జరగనున్నాయి. ఇక భారత్ పాక్ మధ్య దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 14న హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నీలో భారత్, పాక్, యూఏఈ, ఒమాన్ జట్లు గ్రూప్ ఏలో, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ జట్లు గ్రూప్ బీలో ఉన్నాయి.


ఇవి కూడా చదవండి

జ్యూరిచ్ డైమండ్ లీగ్ ఫైనల్‌కు దూసుకెళ్లిన నీరజ్ చోప్రా..

పాక్‌ క్రికెటర్ల జీతాల్లో కోత

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 18 , 2025 | 02:08 PM