T20 Against England Women: ఆఖర్లో తడ బ్యాటు
ABN , Publish Date - Jul 06 , 2025 | 03:34 AM
కీలక బ్యాటర్లు డెత్ ఓవర్లలో తడబాటుకు గురవడంతో ఇంగ్లండ్ మహిళలతో మూడో టీ20లో భారత్‌కు నిరాశే ఎదురైంది. శుక్రవారం రాత్రి జరిగిన ఉత్కంఠ పోరులో ఐదు పరుగుల స్వల్ప తేడాతో...

ఉత్కంఠ పోరులో భారత్ ఓటమి
ఇంగ్లండ్ మహిళలతో మూడో టీ20
లండన్: కీలక బ్యాటర్లు డెత్ ఓవర్లలో తడబాటుకు గురవడంతో ఇంగ్లండ్ మహిళలతో మూడో టీ20లో భారత్‌కు నిరాశే ఎదురైంది. శుక్రవారం రాత్రి జరిగిన ఉత్కంఠ పోరులో ఐదు పరుగుల స్వల్ప తేడాతో ఇంగ్లండ్ గెలుపొందింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీ్‌సలో పర్యాటక జట్టు ఆధిక్యాన్ని 2-1కి తగ్గించింది. టాస్ నెగ్గి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 171/9 స్కోరు సాధించింది. సోఫీ డంక్లే (75), డానీ వ్యాట్ (66) తొలి వికెట్‌కు 137 పరుగులు జోడించారు. ఆపై భారత బౌలర్లు విజృంభించడంతో ఇంగ్లండ్ కేవలం 25 బంతుల తేడాతో 31 పరుగులకు చివరి తొమ్మిది వికెట్లు కోల్పోయింది.
తెలుగు బౌలర్లు అరుంధతి రెడ్డి మూడు, శ్రీచరణి రెండు వికెట్లు పడగొట్టారు. ఛేదనలో మంధాన (56), షఫాలీ వర్మ (47) మొదటి వికెట్‌కు 85 పరుగులతో ధనాధన్ ఆరంభం ఇచ్చారు. ఈ దశలో లారెన్ (2/30) 16వ ఓవర్లో మంధానాను అవుట్ చేయడం మ్యాచ్‌ను మలుపు తిప్పింది. దాంతో భారత్ 20 ఓవర్లలో 166/5 స్కోరుకే పరిమితమై ఓడింది. చివరి బంతికి ఆరు పరుగులు కావాల్సిన దశలో కెప్టెన్ హర్మన్ (23) భారీ షాట్ కొట్టే యత్నంలో క్యాచవుటైంది. కాగా ఇంగ్లండ్ కెప్టెన్ నాట్ షివర్ బ్రంట్ గాయంతో సిరీ్‌సలో మిగిలిన రెండు టీ20లకు దూరమైంది. ఆమె స్థానంలో టాపార్డర్ బ్యాటర్ మియా బౌచియర్ జట్టులోకి వచ్చింది.
సంక్షిప్తస్కోర్లు:
ఇంగ్లండ్: 20 ఓవర్లలో 171/9 (డంక్లే 75, వ్యాట్ 66, ఎకిల్‌స్టోన్ 10, దీప్తిశర్మ 3/27, అరుంధతి రెడ్డి 3/32, శ్రీచరణి 2/43);
భారత్: 20 ఓవర్లలో 166/5 (మంధాన 56, షఫాలీ 47, హర్మన్ 23, జెమీమా 20, లారెన్ 2/30).
ఇవీ చదవండి:
ఆర్సీబీ స్టార్ సెన్సేషనల్ నాక్
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి