Share News

Asia Cup Hockey: గెలుపే లక్ష్యంగా

ABN , Publish Date - Aug 29 , 2025 | 02:08 AM

ఇటీవలి కాలంలో వరుస ఓటములతో డీలాపడ్డ భారత హాకీ జట్టు బలంగా పుంజుకోవాలనుకొంటోంది. ఆసియా కప్‌ నెగ్గడం ద్వారా వచ్చే ఏడాది జరిగే వరల్డ్‌ కప్‌ బెర్త్‌ను సాధించే ఆఖరి అవకాశాన్ని సద్వినియోగం...

Asia Cup Hockey: గెలుపే లక్ష్యంగా

మ. 3 నుంచి సోనీ నెట్‌వర్క్‌లో..

  • తొలి మ్యాచ్‌లో చైనాతో భారత్‌ ఢీ

  • ఆసియాకప్‌ హాకీ నేటినుంచే

రాజ్‌గిర్‌ (బిహార్‌): ఇటీవలి కాలంలో వరుస ఓటములతో డీలాపడ్డ భారత హాకీ జట్టు బలంగా పుంజుకోవాలనుకొంటోంది. ఆసియా కప్‌ నెగ్గడం ద్వారా వచ్చే ఏడాది జరిగే వరల్డ్‌ కప్‌ బెర్త్‌ను సాధించే ఆఖరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకొంటోంది. శుక్రవారం ఆరంభమయ్యే ఈ టోర్నీ పూల్‌-ఎలో తమ తొలి మ్యాచ్‌లో చైనాతో భారత్‌ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ ఫేవరెట్‌గా కనిపిస్తున్నా.. అటాకింగ్‌ గేమ్‌ ఆడే చైనాను ఏ మాత్రం తక్కువగా అంచనా వేసినా ఫలితం తారుమారయ్యే ప్రమాదముంది. భారత్‌, చైనాలోపాటు జపాన్‌, కజకిస్థాన్‌ పూల్‌-ఎలో.. దక్షిణ కొరియా, మలేసియా, బంగ్లాదేశ్‌, చైనీస్‌ తైపీ పూల్‌-బిలో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

యూఎస్ ఓపెన్ 2025.. మెద్వెదెవ్‌ అవుట్‌

ఏషియన్ షూటింగ్ ఛాంపియన్‌షిప్.. ఇషా బృందానికి కాంస్యం

మరిన్ని క్రీడా తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 29 , 2025 | 02:08 AM