Asia Cup Clash: సూపర్ ప్రాక్టీస్ కావాలని
ABN , Publish Date - Sep 19 , 2025 | 06:10 AM
ఆసియాక్‌పలో అజేయంగా దూసుకెళుతున్న టీమిండియా గ్రూప్ ‘ఎ’లో తమ ఆఖరి మ్యాచ్ ఆడనుంది. ఇందులో భాగంగా శుక్రవారం ఒమన్‌తో తలపడనుంది. అయితే ఈ నామమాత్రపు మ్యాచ్‌ను...
నేడు ఒమన్‌తో భారత్ పోరు
రాత్రి 8 నుంచి సోనీ నెట్‌వర్క్‌లో..
అబుధాబి: ఆసియాక్‌పలో అజేయంగా దూసుకెళుతున్న టీమిండియా గ్రూప్ ‘ఎ’లో తమ ఆఖరి మ్యాచ్ ఆడనుంది. ఇందులో భాగంగా శుక్రవారం ఒమన్‌తో తలపడనుంది. అయితే ఈ నామమాత్రపు మ్యాచ్‌ను సూపర్-4కు సన్నాహకంగా ఉపయోగించుకోవాలని భారత్ భావిస్తోంది. టాపార్డర్ విశేషంగా రాణించడంతో ఇప్పటిదాకా మిడిల్, లోయరార్డర్ బ్యాటర్లకు పెద్దగా అవకాశం దక్కలేదు. ఆడిన రెండు మ్యాచ్‌లు కూడా ఏకపక్షంగానే ముగిశాయి. టాప్-8లోని ముగ్గురు ప్లేయర్లు అసలు బరిలోకి దిగలేదు. ఈ ఆదివారం మరోసారి పాకిస్థాన్‌తో తలపడబోతున్న తరుణంలో బ్యాటర్లకు క్రీజులో తగినంత సమయం లభించాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. అందుకే టాస్ గెలిస్తే బ్యాటింగ్ వైపు మొగ్గుచూపవచ్చు. మిడిలార్డర్‌లో శాంసన్, అక్షర్ అసలు బరిలోకే దిగలేదు. మరోవైపు కోచ్ గంభీర్ ఈ మ్యాచ్ కోసం పెద్దగా ప్రయోగాలు చేయాలనుకోవడం లేదు. ఒకవేళ బుమ్రాకు విశ్రాంతినిచ్చి మరో పేసర్ అర్ష్‌దీ్‌పను పరీక్షించవచ్చు. అబుధాబి పిచ్ పేసర్లకు అనుకూలించనుండడంతో హర్షిత్‌ను ఎంపిక చేసినా ఆశ్చర్యం లేదు. అటు ఒమన్ ముందుగా బ్యాటింగ్‌కు దిగితే భారత బౌలర్లను ఎదుర్కొని పూర్తి ఓవర్లు ఆడగలదా అంటే సందేహమే. ఆ జట్టు పాక్‌పై 67, యూఏఈపై 130 రన్స్ మాత్రమే చేయగలిగింది.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి