Womens Asia Cup 2025: సూపర్ 4కు భారత్
ABN , Publish Date - Sep 09 , 2025 | 02:10 AM
మహిళల ఆసియాకప్‌లో భారత హాకీ జట్టు సూపర్-4కు దూసుకెళ్లింది. పూల్-బిలో సోమవారం జరిగిన ఆఖరి మ్యాచ్‌లో భారత్ 12-0తో సింగపూర్‌ను చిత్తు చేసింది. నవనీత్ (14వ, 20వ, 28వ నిమిషాలు), ముంతాజ్ (2వ, 32వ, 39వ) చెరో...
12-0తో సింగపూర్‌పై గెలుపు
మహిళల ఆసియా కప్ హాకీ
హాంగ్జౌ (చైనా): మహిళల ఆసియాకప్‌లో భారత హాకీ జట్టు సూపర్-4కు దూసుకెళ్లింది. పూల్-బిలో సోమవారం జరిగిన ఆఖరి మ్యాచ్‌లో భారత్ 12-0తో సింగపూర్‌ను చిత్తు చేసింది. నవనీత్ (14వ, 20వ, 28వ నిమిషాలు), ముంతాజ్ (2వ, 32వ, 39వ) చెరో మూడు గోల్స్‌తో చెలరేగగా.. నేహ (11వ, 38వ) డబుల్ సాధించింది. లాల్‌రిమ్సియామి (13వ), ఉదిత (29వ), షర్మిలా దేవి (45వ), రుతుజా (53వ) తలో గోల్ చేశారు. మొత్తం మూడు మ్యాచ్‌ల నుంచి ఏడు పాయింట్లు సాధించిన భారత్.. జపాన్‌తో సమంగా నిలిచినా మెరుగైన గోల్స్ తేడాతో గ్రూప్ టాపర్‌గా సూపర్-4 బెర్త్ దక్కించుకొంది. బుధవారం జరిగే సూపర్-4 మ్యాచ్‌లో కొరియాతో భారత్ తలపడనుంది.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి