Share News

India Dominates West Indies: తొలి గంటలోనే

ABN , Publish Date - Oct 15 , 2025 | 03:12 AM

వెస్టిండీ్‌సపై తమ ఆధిపత్యాన్ని భారత జట్టు మరోసారి చాటుకుంది. నాలుగో రోజే ఫలితం తేలిపోయిన రెండో టెస్టులో మంగళవారం గిల్‌ సేన ఏడు వికెట్ల తేడాతో తమ గెలుపు లాంఛనాన్ని పూర్తి చేసింది...

India Dominates West Indies: తొలి గంటలోనే

రెండో టెస్టులో విండీస్‌పై భారత్‌ ఘన విజయం

  • రాహుల్‌ అజేయ అర్ధసెంచరీ

  • 2-0తో సిరీస్‌ క్లీన్‌స్వీప్‌

న్యూఢిల్లీ: వెస్టిండీ్‌సపై తమ ఆధిపత్యాన్ని భారత జట్టు మరోసారి చాటుకుంది. నాలుగో రోజే ఫలితం తేలిపోయిన రెండో టెస్టులో మంగళవారం గిల్‌ సేన ఏడు వికెట్ల తేడాతో తమ గెలుపు లాంఛనాన్ని పూర్తి చేసింది. దీంతోపాటు ఈ రెండు టెస్టుల సిరీ్‌సను 2-0తో క్లీన్‌స్వీ్‌ప చేసింది. అలాగే వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షి్‌పలో భాగంగా 12 పాయింట్లను ఖాతాలో వేసుకుని, పట్టికలో ఆసీస్‌, శ్రీలంక తర్వాత భారత్‌ మూడో స్థానంలో నిలిచింది. మరోవైపు విండీ్‌సపై భారత్‌కిది రికార్డు స్థాయిలో వరుసగా పదో టెస్టు సిరీస్‌ విజయం కావడం విశేషం. 121 పరుగుల ఛేదన కోసం రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన భారత్‌ 35.2 ఓవర్లలో 124/3 స్కోరుతో గెలిచింది. కేఎల్‌ రాహుల్‌ (58 నాటౌట్‌) అజేయ అర్ధసెంచరీతో రాణించాడు. చేజ్‌కు రెండు వికెట్లు దక్కాయి. అయితే ఫాలోఆన్‌ ఆడినప్పటికీ విండీస్‌ చూపిన తెగువ క్రీడాభిమానులను ఆకట్టుకుంది. తొలి ఇన్నింగ్స్‌ను భారత్‌ 518/5 స్కోరు వద్ద డిక్లేర్‌ చేయగా.. విండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 248, ఫాలో ఆన్‌ ఆడుతూ రెండో ఇన్నింగ్స్‌లో 390 రన్స్‌ చేసింది. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా కుల్దీప్‌, ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీ్‌సగా జడేజా నిలిచారు.

17.2 ఓవర్లలోనే..: 63/1 స్కోరుతో నిలిచిన భారత్‌ ఆఖరి రోజు 17.2 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించింది. విజయానికి మరో 58 పరుగుల కోసం బరిలోకి దిగగా క్రీజులో ఉన్న రాహుల్‌, సుదర్శన్‌ ఆటను పూర్తి చేస్తారని అంతా భావించినా.. విండీస్‌ బౌలర్లు మరో రెండు వికెట్లను పడగొట్టగలిగారు. పియెర్‌ ఓవర్‌లో రాహుల్‌ 6,4తో వేగం చూపినా.. తర్వాతి ఓవర్‌లోనే సుదర్శన్‌ను చేజ్‌ అవుట్‌ చేశాడు. దీంతో రెండో వికెట్‌కు 79 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇక వేగంగా మ్యాచ్‌ను ముగించే క్రమంలో గిల్‌ 33వ ఓవర్‌లో 6,4 బాదినప్పటికీ అదే ఓవర్‌లో చేజ్‌కే దొరికిపోయాడు. కానీ ఆ తర్వాత మరో 14 బంతుల్లోనే రాహుల్‌, జురెల్‌ (6 నాటౌట్‌) మ్యాచ్‌ను ముగించారు.


స్కోరుబోర్డు

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 518/5 డిక్లేర్‌.

వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌: 248.

వెస్టిండీస్‌ రెండో ఇన్నింగ్స్‌: 390.

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (సి) ఫిలిప్‌ (బి) వారికన్‌ 8, రాహుల్‌ (నాటౌట్‌) 58, సాయి సుదర్శన్‌ (సి) హోప్‌ (బి) చేజ్‌ 39, గిల్‌ (సి) గ్రీవ్స్‌ (బి) చేజ్‌ 13, జురెల్‌ (నాటౌట్‌) 6; ఎక్స్‌ట్రాలు: 0; మొత్తం: 35.2 ఓవర్లలో 124/3; వికెట్ల పతనం: 1-9, 2-88, 3-108. బౌలింగ్‌: సీల్స్‌ 3-0-14-0; వారికన్‌ 15.2-4-39-1, పియెర్‌ 8-0-35-0, చేజ్‌ 9-2-36-2.

1

ఒకే జట్టు (వెస్టిండీస్‌)పై వరుసగా ఎక్కువ టెస్టు సిరీస్‌ (10) విజయాలు సాధించిన జట్టుగా భారత్‌. దక్షిణాఫ్రికాతో (విండీస్‌పై 10) సంయుక్తంగా నిలిచింది. అలాగే విండీస్‌పై భారత్‌కిది రికార్డు స్థాయిలో వరుసగా 27వ టెస్టు విజయం.

3

స్వదేశంలో ఎక్కువ (122) టెస్టు మ్యాచ్‌లు గెలిచిన మూడో జట్టుగా భారత్‌. ఆస్ట్రేలియా (262), ఇంగ్లండ్‌ (241) ముందున్నాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

విశాఖ ఏఐ రాజధానిగా మారుతుంది: మంత్రి సత్యప్రసాద్

విశాఖ గూగుల్ ఏఐ హబ్.. భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు బలం: ప్రధాని మోదీ

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 15 , 2025 | 03:12 AM