Share News

Asia Cup Hockey 2025: గ్రూప్‌ టాపర్‌ భారత్‌

ABN , Publish Date - Sep 02 , 2025 | 04:51 AM

ఆసియా కప్‌ హాకీలో గ్రూప్‌ దశను భారత్‌ ఘనంగా ముగించింది. ఈపాటికే సూపర్‌-4 బెర్త్‌ను ఖరారు చేసుకొన్న భారత్‌.. పూల్‌-ఎలో సోమవారం ఏకపక్షంగా సాగిన ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో 15-0తో కజకిస్థాన్‌ను చిత్తు చేసింది. అభిషేక్‌ 4 గోల్స్‌తో...

Asia Cup Hockey 2025: గ్రూప్‌ టాపర్‌ భారత్‌

  • 15-0తో కజకిస్థాన్‌పై ఘన విజయం

  • సూపర్‌-4కు చైనా, మలేసియా, కొరియా

  • ఆసియా కప్‌ హాకీ

రాజ్‌గిర్‌ (బిహార్‌): ఆసియా కప్‌ హాకీలో గ్రూప్‌ దశను భారత్‌ ఘనంగా ముగించింది. ఈపాటికే సూపర్‌-4 బెర్త్‌ను ఖరారు చేసుకొన్న భారత్‌.. పూల్‌-ఎలో సోమవారం ఏకపక్షంగా సాగిన ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో 15-0తో కజకిస్థాన్‌ను చిత్తు చేసింది. అభిషేక్‌ 4 గోల్స్‌తో అదరగొట్టగా, సుఖ్‌జీత్‌, జుగ్‌రాజ్‌ చెరో 3 గోల్స్‌ నమోదు చేశారు. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన భారత్‌ 9 పాయింట్లతో గ్రూప్‌ టాపర్‌గా నిలిచింది. ఇదే గ్రూప్‌లో చైనా, జపాన్‌ మధ్య మ్యాచ్‌ 2-2తో డ్రా అయింది. ఇరుజట్లూ చెరో 4 పాయింట్లతో సమంగా నిలిచినా.. మెరుగైన గోల్స్‌ తేడాతో చైనా రెండో స్థానంతో సూపర్‌-4కు చేరింది. పూల్‌-బి నుంచి మలేసియా, కొరియా సూపర్‌-4లో ప్రవేశించాయి. సోమవారం జరిగిన తమ ఆఖరి మ్యాచ్‌లో మలేసియా 15-0తో చైనీస్‌ తైపీపై, కొరియా 5-1తో బంగ్లాదేశ్‌పై గెలిచాయి. 9 పాయింట్లతో మలేసియా గ్రూప్‌-బి టాపర్‌గా నిలవగా.. రెండు మ్యాచ్‌లు గెలిచిన కొరియా 6 పాయింట్లతో రెండో స్థానం దక్కించుకొంది. బుధవారం నుంచి రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ పద్ధతిలో జరిగే సూపర్‌-4 తొలి మ్యాచ్‌లో కొరియాతో భారత్‌ తలపడనుంది.

ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 02 , 2025 | 04:51 AM