Share News

India Defeats South Africa: ఆఖరి పంచ్‌ అదుర్స్‌

ABN , Publish Date - Dec 20 , 2025 | 04:35 AM

దక్షిణాఫ్రికాతో ఐదు టీ20ల సిరీ్‌సను భారత్‌ ఘనంగా ముగించింది. తిలక్‌ వర్మ (42 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్‌తో 73), హార్దిక్‌ పాండ్యా (25 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 63) తుఫాన్‌ ఇన్నింగ్స్‌తో చెలరేగగా...

India Defeats South Africa: ఆఖరి పంచ్‌ అదుర్స్‌

30 రన్స్‌తో భారత్‌ విజయం

3-1తో సిరీస్‌ కైవసం ఫ చెలరేగిన తిలక్‌, హార్దిక్‌

అహ్మదాబాద్‌: దక్షిణాఫ్రికాతో ఐదు టీ20ల సిరీ్‌సను భారత్‌ ఘనంగా ముగించింది. తిలక్‌ వర్మ (42 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్‌తో 73), హార్దిక్‌ పాండ్యా (25 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 63) తుఫాన్‌ ఇన్నింగ్స్‌తో చెలరేగగా.. బౌలింగ్‌లో స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి (4/53) తిప్పేయడంతో భారీ ఛేదనలో సఫారీలు 30 రన్స్‌ తేడాతో ఓడారు. దీంతో 3-1తో సూర్యకుమార్‌ సేన సిరీ్‌సను ఖాతాలో వేసుకుంది. మరోవైపు ఈ ఫార్మాట్‌లో భారత్‌కిది వరుసగా 8వ సిరీస్‌ కావడం విశేషం. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా భారత్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 231 పరుగులు చేసింది. శాంసన్‌ (22 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 37), అభిషేక్‌ (21 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 34) శుభారంభం అందించారు. బాష్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 201 పరుగులు చేసి ఓడింది. డికాక్‌ (35 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 65), బ్రెవిస్‌ (17 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 31) మాత్రమే రాణించారు. బుమ్రాకు రెండు వికెట్లు దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా హార్దిక్‌, ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీ్‌సగా వరుణ్‌ చక్రవర్తి నిలిచారు.

డికాక్‌ బాదినా..: భారీ ఛేదనను సఫారీలు కూడా దీటుగానే ఆరంభించారు. కానీ మధ్య ఓవర్లలో స్పిన్నర్‌ వరుణ్‌ ధాటికి చకచకా పెవిలియన్‌కు చేరి మూల్యం చెల్లించుకున్నారు. ఓపెనర్‌ డికాక్‌ తొలి ఓవర్‌లోనే హ్యాట్రిక్‌ ఫోర్లతో తన ఉద్దేశాన్ని చాటుకున్నాడు. మరో ఓపెన్‌ హెన్‌డ్రిక్స్‌ (13) ఇబ్బందిపడినా తను మాత్రం మూడో ఓవర్‌లో 6,4,4,4తో 23 పరుగులు రాబట్టాడు. ఈ జోరుకు పవర్‌ప్లేలో స్కోరు 67కి చేరింది. కానీ స్పిన్నర్‌ వరుణ్‌ తొలి ఓవర్‌లోనే హెన్‌డ్రిక్స్‌ను అవుట్‌ చేయడంతో మొదటి వికెట్‌కు 69 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఈ దశలో డికాక్‌కు వన్‌డౌన్‌ బ్యాటర్‌ బ్రెవిస్‌ సహకరించాడు. 30 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసిన డికాక్‌.. వరుణ్‌ ఓవర్‌లో 6,4 అటు బ్రెవిస్‌ 6,4తో 23 రన్స్‌ వచ్చాయి. ఆ వెంటనే హార్దిక్‌ ఓవర్‌లోనూ బ్రెవిస్‌ 4,6,4 బాదడంతో 10 ఓవర్లలో స్కోరు 118/1కి చేరింది. అయితే సజావుగా సాగుతున్న సఫారీల ఆటకు బుమ్రా బ్రేక్‌ వేశాడు. భారీ షాట్లతో చెలరేగుతున్న డికాక్‌ను తను రిటర్న్‌ క్యాచ్‌తో అవుట్‌ చేసి జట్టుకు రిలీ్‌ఫనిచ్చాడు. తర్వాతి ఓవర్‌లోనే బ్రెవి్‌సను హార్దిక్‌ వెనక్కి పంపడంతో మ్యాచ్‌ భారత్‌ చేతుల్లోకి వచ్చింది. మార్‌క్రమ్‌ (6), ఫెరీరా (0)లను వరుణ్‌ ఒకే ఓవర్‌లో అవుట్‌ చేయడంతో మరిక కోలుకోలేకపోయింది. చివర్లో లిండే (16), యాన్సెన్‌ (14) మెరుపులు ఓటమి అంతరాన్ని తగ్గించాయి.

00-Sports.jpg


ఆది నుంచే దూకుడు: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత ఇన్నింగ్స్‌ ఆరంభం నుంచి చివరి వరకు టాప్‌ గేర్‌లోనే సాగింది. గిల్‌ స్థానంలో ఓపెనర్‌గా బరిలోకి దిగిన శాంసన్‌తో పాటు మరో ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ సఫారీ బౌలర్లను ఆడేసుకున్నారు. ఇక మధ్య ఓవర్లలో హార్దిక్‌, తిలక్‌ వీరంగంతో జట్టు స్కోరు అవలీలగా 220 దాటింది. ఈ జోడీ నాలుగో వికెట్‌కు 44 బంతుల్లోనే 105 పరుగుల భాగస్వామ్యం అందించడం విశేషం. యాన్సెన్‌ తొలి ఓవర్‌లోనే అభిషేక్‌ హ్యాట్రిక్‌ ఫోర్లు, శాంసన్‌ సిక్సర్‌తో 19 రన్స్‌ వచ్చాయి. ఇక బార్ట్‌మన్‌ ఓవర్‌లో శాంసన్‌ మూడు ఫోర్లు సాధించాడు. యాన్సన్‌ ఓవర్‌లో మరోసారి ఈ జోడీ 15 రన్స్‌ రాబట్టింది. అయితే ఆరో ఓవర్‌లో అభిషేక్‌ను బాష్‌ అవుట్‌ చేయడంతో తొలి వికెట్‌కు 63 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత తిలక్‌ జోరుతో పదో ఓవర్‌లోనే జట్టు స్కోరు 100 దాటింది. ఈ దశలో ఊపు మీదున్న శాంసన్‌ను స్పిన్నర్‌ లిండే బౌల్డ్‌ చేయగా, కెప్టెన్‌ సూర్య (5) ఎప్పటిలాగే నిరాశపర్చాడు. కానీ సఫారీల సంతోషాన్ని హార్దిక్‌ ఆవిరి చేశాడు. ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్‌గా మలిచిన పాండ్యా ప్రతీ బంతిని బాదడమే లక్ష్యంగా సాగాడు. 14వ ఓవర్‌లో వరుసగా 4,6,6,4తో చెలరేగగా తిలక్‌ సిక్సర్‌తో మొత్తం 27 రన్స్‌ సమకూరాయి. 30 బంతుల్లో తిలక్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేయగా.. 17వ ఓవర్‌లో 6,4,6తో పాండ్యా 16 బంతుల్లోనే ఈ ఫీట్‌ను అందుకున్నాడు. చివరి ఓవర్‌లో దూబే (10 నాటౌట్‌) 6,4తో 17 రన్స్‌ రాబట్టిన భారత్‌ హార్దిక్‌, తిలక్‌ల వికెట్లు కోల్పోయింది.

స్కోరుబోర్డు

భారత్‌: శాంసన్‌ (బి) లిండే 37, అభిషేక్‌ (సి) డికాక్‌ (బి) బాష్‌ 34, తిలక్‌ (రనౌట్‌) 73, సూర్య (సి) మిల్లర్‌ (బి) బాష్‌ 5, హార్దిక్‌ (సి) హెన్‌డ్రిక్స్‌ (బి) బార్ట్‌మన్‌ 63, దూబే (నాటౌట్‌) 10, జితేశ్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 20 ఓవర్లలో 231/5. వికెట్ల పతనం: 1-63, 2-97, 3-115, 4-220, 5-227. బౌలింగ్‌: ఎన్‌గిడి 4-0-29-0, యాన్సెన్‌ 4-0-50-0, బార్ట్‌మన్‌ 3-0-39-1, బాష్‌ 3-0-44-2, ఫెరీరా 2-0-20-0, లిండే 4-0-46-1.

దక్షిణాఫ్రికా: డికాక్‌ (సి అండ్‌ బి) బుమ్రా 65, హెన్‌డ్రిక్స్‌ (సి) దూబే (బి) వరుణ్‌ 13, బ్రెవిస్‌ (సి) సుందర్‌ (బి) హార్దిక్‌ 31, మిల్లర్‌ (సి) శాంసన్‌ (బి) అర్ష్‌దీప్‌ 18, మార్‌క్రమ్‌ (ఎల్బీ) వరుణ్‌ 6, ఫెరీరా (బి) వరుణ్‌ 0, లిండే (బి) వరుణ్‌ 16, యాన్సెన్‌ (సి) శాంసన్‌ (బి) బుమ్రా 14, బాష్‌ (నాటౌట్‌) 17, ఎన్‌గిడి (నాటౌట్‌) 7, ఎక్స్‌ట్రాలు: 14; మొత్తం: 20 ఓవర్లలో 201/8. వికెట్ల పతనం: 1-69, 2-120, 3-122, 4-135, 5-135, 6-154, 7-163, 8-177. బౌలింగ్‌: అర్ష్‌దీప్‌ 4-0-47-1, సుందర్‌ 4-0-30-0, బుమ్రా 4-0-17-2, వరుణ్‌ 4-0-53-4, హార్దిక్‌ 3-0-41-1, అభిషేక్‌ 1-0-13-0.


1

భారత్‌ తరఫున టీ20ల్లో వేగంగా (528 బంతుల్లో) వెయ్యి పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌గా అభిషేక్‌. సూర్య (573) రికార్డును బ్రేక్‌ చేశాడు.

2

భారత్‌ నుంచి పొట్టి ఫార్మాట్‌లో వేగవంతమైన (16 బంతుల్లో) అర్ధసెంచరీ సాధించిన రెండో బ్యాటర్‌గా హార్దిక్‌. యువరాజ్‌ (12) టాప్‌లో ఉన్నాడు.

3

అంతర్జాతీయ టీ20ల్లో 2వేల రన్స్‌+100 వికెట్లు పూర్తి చేసిన మూడో క్రికెటర్‌గా హార్దిక్‌. అంతకుముందు షకీబల్‌, నబీ ఉన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

ప్రయాణికులకు పండగ లాంటి వార్త.. రైల్వే శాఖ కీలక ప్రకటన

అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ

For More AP News And Telugu News

Updated Date - Dec 20 , 2025 | 04:35 AM