World Para Athletics 2025: చివరిరోజు 4 పతకాలు
ABN , Publish Date - Oct 06 , 2025 | 02:59 AM
ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్స్‌షి్‌ప్సను భారత్ ఘనంగా ముగించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా 22 పతకాలు (6 స్వర్ణ, 9 రజత, 7 కాంస్య) సాధించి పదో స్థానంలో నిలిచింది....
ప్రపంచ పారా అథ్లెటిక్స్
సిమ్రన్, ప్రీతి, నవ్‌దీ్‌పకు రజతాలు
మొత్తంగా భారత్ ఖాతాలో 22 మెడల్స్
న్యూఢిల్లీ: ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్స్‌షి్‌ప్సను భారత్ ఘనంగా ముగించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా 22 పతకాలు (6 స్వర్ణ, 9 రజత, 7 కాంస్య) సాధించి పదో స్థానంలో నిలిచింది. పోటీలకు చివరి రోజైన ఆదివారం మరో మూడు రజతాలు, కాంస్యం భారత్ ఖాతాలో చేరాయి. సిమ్రన్ శర్మ, ప్రీతి పాల్ చాంపియన్‌షి్‌ప్సలో రెండో పతకాన్ని సొంతం చేసుకొన్నారు. మహిళల 200 మీటర్ల టీ12 ఫైనల్లో సిమ్రన్ 24.46 సెకన్ల టైమింగ్‌తో రజతం సాధించింది. ఇప్పటికే 100 మీ. టీ12 కేటగిరీలో సిమ్రన్ స్వర్ణం నెగ్గిన సంగతి తెలిసిందే. ఇక, మహిళల 100 మీటర్ల టీ35 ఫైనల్లో 14.33 సెకన్లలో రేస్ పూర్తి చేసిన ప్రీతి రజతం దక్కించుకొంది. ఇదివరకే 200 మీ. టీ35 రేస్‌లో పాల్ కాంస్యం సాధించింది.పురుషుల జావెలిన్ త్రో ఎఫ్41 కేటగిరీలో 45.46 మీటర్ల దూరం విసిరిన నవ్‌దీప్ రెండో స్థానంతో రజతం అందుకొన్నాడు. పురుషుల 200 మీటర్ల టీ44 విభాగంలో సందీప్ 23.60 సెకన్ల టైమింగ్‌తో కాంస్యం సాధించాడు. బ్రెజిల్ 44 (15 స్వర్ణ, 20 రజత, 9 కాంస్య) పతకాలతో టాప్‌లో నిలవగా.. చైనా 52 (13-22-17), ఇరాన్ 16 (9-2-5) మెడల్స్‌తో రెండు, మూడు స్థానాలు దక్కించుకున్నాయి.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
రూ.485కే 72 రోజుల ప్లాన్..అన్‌లిమిటెడ్ కాలింగ్, 2 జీబీ డేటా
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి