Ind Beats Pak: భారత్ రివెంజ్.. పాక్‌పై ఘన విజయం
ABN , Publish Date - Sep 14 , 2025 | 11:30 PM
పాక్‌పై భారత్ చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. 127 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన భారత్ ఏడు వికెట్ల తేడాతో సునాయాస విజయం సొంతం చేసుకుంది. 47 పరుగులతో సూర్యకుమార్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఆసియా కప్‌లో భాగంగా పాక్‌తో తొలి పోరులో టీమిండియా సునాయాస విజయం సాధించింది. పాక్ నిర్దేశించిన 128 పరుగుల లక్ష్యాన్ని 7 వికెట్ల తేడాతో సులువుగా ఛేదించి చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. ఓపెనర్లుగా శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ బరిలోకి దిగారు. శుభ్‌మన్ పది పరుగులకే ఔటైనా మరో ఎండ్‌లో అభిషేక్ శర్మ వేగంగా 31 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఆ తరువాత అయూబ్ బౌలింగ్‌లో అతడు ఫహీమ్ అష్రఫ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టడంతో భారత్ స్పీడు కాస్త నెమ్మదించింది (Ind Beats Pak Asia Cup).
అనంతరం తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ నిలకడగా ఆడుతూ పరుగులు రాబట్టారు. దీంతో, పది ఓవర్లకు భారత్ 88 పరుగులు చేసి పటిష్ఠత స్థితికి చేరుకుంది. విజయాన్ని దాదాపుగా ఖరారు చేసుకుంది. అయితే, అయూబ్ బౌలింగ్‌లో తిలక్ వర్మ్ (31) బౌల్డ్ అయ్యి వెనుదిరిగాడు. చివర్లో సూర్య కుమార్ (47) దూకుడుగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. పాక్‌పై భారత్‌కు ఇది తొలి విజయం కాగా టోర్నీలో ఇది వరుసగా రెండో విజయం.
ఇవి కూడా చదవండి
పాక్‌తో మ్యాచ్.. నల్ల బ్యాండ్స్ ధరించి నిరసన తెలపనున్న టీమిండియా?
నేటి ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ లైవ్ ఎక్కడొస్తుంది.. ఎలా చూడాలంటే..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి