India Australia A Unofficial Test: బ్యాటర్ల వైఫల్యం
ABN , Publish Date - Sep 25 , 2025 | 03:15 AM
భారత్-ఎ బ్యాటర్లు ఘోరంగా విఫలమవడంతో.. రెండో అనధికార టెస్ట్‌లో ఆస్ట్రేలియా-ఎ భారీ ఆధిక్యాన్ని నమోదు చేసింది. ఆటకు రెండో రోజైన బుధవారం తొలి ఇన్నింగ్స్‌లో,,,
భారత్-ఎ 194 ఆలౌట్
ఆసీ్‌స-ఎ 16/3
242 పరుగుల ఆధిక్యంలో కంగారూలు
లఖ్‌నవూ: భారత్-ఎ బ్యాటర్లు ఘోరంగా విఫలమవడంతో.. రెండో అనధికార టెస్ట్‌లో ఆస్ట్రేలియా-ఎ భారీ ఆధిక్యాన్ని నమోదు చేసింది. ఆటకు రెండో రోజైన బుధవారం తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 194 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరు 420 పరుగులకంటే భారత్ 226 రన్స్ వెనుకబడింది. సాయి సుదర్శన్ (75), నారాయణ్ జగదీశన్ (38) మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. టెస్ట్ రేస్‌లో ఉన్న నితీశ్ కుమార్ (1) సింగిల్ డిజిట్‌కే వెనుదిరగ్గా.. ప్రసిద్ధ్ కృష్ణ (16) కంకషన్‌తో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. పేసర్ హెన్రీ థార్న్‌టన్ 4 వికెట్లు తీశాడు. కాగా, రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ 16/3 స్కోరు చేసింది. ఆలివర్ (1)ను మానవ్ అవుట్ చేయగా.. మెక్‌స్వీనే (11) క్రీజులో ఉన్నాడు. కొంటాస్ (3)ను బ్రార్.. కెల్లీ (0)ని సిరాజ్ పెవిలియన్ చేర్చారు. మొత్తంగా ఆసీస్ 242 రన్స్ ఆధిక్యంలో ఉంది.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి