Share News

Asia Cup 2025: భారత్‌ పాక్‌ కెప్టెన్లు దూరం దూరం

ABN , Publish Date - Sep 10 , 2025 | 05:23 AM

ఆసియాక్‌పలో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో దూకుడును తగ్గించుకోమని సహచరులకు ఎటువంటి సూచనలు చేయలేదని భారత జట్టు కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ చెప్పాడు. మంగళవారం కెప్టెన్ల సంయుక్త మీడియా...

Asia Cup 2025: భారత్‌ పాక్‌ కెప్టెన్లు దూరం దూరం

దుబాయ్‌: ఆసియాక్‌పలో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో దూకుడును తగ్గించుకోమని సహచరులకు ఎటువంటి సూచనలు చేయలేదని భారత జట్టు కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ చెప్పాడు. మంగళవారం కెప్టెన్ల సంయుక్త మీడియా సమావేశంలో ట్రోఫీ ఆవిష్కరణ అనంతరం విలేకరులు అడిన ప్రశ్నలకు వారు సమాధానమిచ్చారు. ఇందులో పాక్‌ కెప్టెన్‌ సల్మాన్‌ అలీ అగా, సూర్యకుమార్‌పైనే అందరి దృష్టీ నెలకొంది. వీరిద్దరి మధ్యలో అఫ్ఘానిస్థాన్‌ కెప్టెన్‌ రషీద్‌ ఖాన్‌ కూర్చున్నాడు. కాగా, పాక్‌తో మ్యాచ్‌లో దూకుడుగా ఆడే విషయమై ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సూర్య సూటిగా బదులివ్వలేదు. ‘ఫీల్డ్‌లో దూకుడు ఎప్పుడూ ఉంటుంది. గెలవాలంటే అది తప్పని సరి’ అని సూర్య సమాధానమిచ్చాడు. సల్మాన్‌ కూడా అదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ప్రత్యేకంగా ఆటగాళ్లకు ఎలాంటి సూచనలు చేయలేదని చెప్పాడు. కాగా, ప్రెస్‌మీట్‌ ముగిసిన తర్వాత ఆయా జట్ల సారథులు ఒకరితో ఒకరు కరచాలనం చేసుకొంటుంటే.. పాక్‌ కెప్టెన్‌ సల్మాన్‌ మాత్రం స్టేజ్‌ దిగి వెళ్లిపోయాడు. అయితే, కింద నిల్చున్న సల్మాన్‌ మెట్లు దిగుతున్న సూర్యకు షేక్‌ హ్యాండ్‌ ఇవ్వగా.. సూర్య కూడా లాంఛనం అన్నట్టుగా చేయిచ్చాడు. హగ్‌ మాత్రం చేసుకోలేదు.

ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 10 , 2025 | 05:23 AM