Share News

India A Women Cricket: భారత్‌ ఎ మహిళల విజయం

ABN , Publish Date - Sep 26 , 2025 | 03:46 AM

షఫాలీ వర్మ (70), మమత (56 నాటౌట్‌) అర్ధ శతకాలతో మెరవడంతో..వన్డే వరల్డ్‌ కప్‌ వామప్‌ మ్యాచ్‌లో భాగంగా గురువారం న్యూజిలాండ్‌పై భారత్‌ ‘ఎ’ మహిళలు నెగ్గారు....

India A Women Cricket: భారత్‌ ఎ మహిళల విజయం

బెంగళూరు: షఫాలీ వర్మ (70), మమత (56 నాటౌట్‌) అర్ధ శతకాలతో మెరవడంతో..వన్డే వరల్డ్‌ కప్‌ వామప్‌ మ్యాచ్‌లో భాగంగా గురువారం న్యూజిలాండ్‌పై భారత్‌ ‘ఎ’ మహిళలు నెగ్గారు. తొలుత కివీస్‌ 273/9 స్కోరు చేసింది. అనంతరం వర్షం వల్ల కుదించిన మ్యాచ్‌లో మనోళ్లు 39.3 ఓవర్లలో 226/6 స్కోరు చేసి గెలుపొందారు.

ఇంగ్లండ్‌ భారీ విజయం :భారత మహిళలతో జరిగిన మరో వామప్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 153 పరుగులతో నెగ్గింది. తొలుత ఇంగ్లండ్‌ 50 ఓవర్లలో 340/9 స్కోరు చేసింది. బ్రంట్‌ (120 రిటైర్డ్‌ హర్ట్‌) శతక్కొట్టింది. భారీ ఛేదనలో భారత్‌ 34 ఓవర్లలో 187 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌ బౌలర్‌ అరుంధతి రెడ్డి గాయపడింది. ఆమెను వీల్‌చైర్‌లో బయటికి తీసుకెళ్లాల్సివచ్చింది.

ఇవి కూడా చదవండి

ఆసియా కప్ 2025లో చరిత్ర సృష్టించిన కుల్దీప్ యాదవ్..వికెట్ల వేటలో రికార్డ్

విండీస్‌తో టెస్ట్ సిరీస్.. జట్టును ప్రకటించిన సెలక్షన్ కమిటీ..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 26 , 2025 | 03:46 AM