Share News

Ind vs Pak: టాస్ గెలిచిన పాకిస్తాన్.. బౌలింగ్ చేయనున్న భారత్!

ABN , Publish Date - Feb 23 , 2025 | 02:13 PM

టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ బౌలింగ్‌కు సిద్ధమవుతోంది. దుబాయ్‌ ఈ ఆసక్తికర మ్యాచ్‌కు వేదికగా నిలిచింది. ఇప్పటికే న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు ఓడిపోయింది.

Ind vs Pak: టాస్ గెలిచిన పాకిస్తాన్.. బౌలింగ్ చేయనున్న భారత్!
Pakistan won the toss and elected to bat first

ఛాంపియన్స్ ట్రోఫీలో మరో కీలక సమరానికి రంగం సిద్ధమవుతోంది. క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్తాన్ (Ind vs Pak) క్రికెట్ మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ బౌలింగ్‌కు సిద్ధమవుతోంది. దుబాయ్‌ ఈ ఆసక్తికర మ్యాచ్‌కు వేదికగా నిలిచింది. ఇప్పటికే న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు ఓడిపోయింది. దీంతో భారత్‌తో జరిగే ఈ మ్యాచ్ ఆ జట్టుకు కీలకం కానుంది (Champions Trophy).


ఆదివారం భారత్‌తో జరిగే మ్యాచ్‌లో కూడా ఓటమి పాలైతే ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి పాకిస్తాన్ దాదాపు నిష్క్రమించినట్టే. అందుకే ఈ మ్యాచ్‌ను పాకిస్తాన్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాగా, టీమిండియా గత మ్యాచ్‌లో బరిలోకి దిగిన టీమ్‌తోనే మార్పులేమీ లేకుండా బరిలోకి దిగుతోంది. పాకిస్తాన్ మాత్రం గత మ్యాచ్‌తో పోల్చుకుంటే ఓ మార్పుతో బరిలోకి దిగుతోంది.


తుది జట్లు:

భారత్: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, కుల్‌దీప్

పాకిస్తాన్: ఇమామ్ ఉల్ హక్, బాబర్ అజామ్, షౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్, సల్మాన్ అలీ అఘా, తయ్యబ్ తీహార్, కుష్దీల్ షా, షహీన్ ఆఫ్రీది, నజీమ్ షా, హరీష్ రౌఫ్, అబ్రార్ అహ్మద్

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Feb 23 , 2025 | 02:13 PM