Share News

Ind vs Pak: టార్గెట్ 242.. టీమిండియా బ్యాటర్లకు సులభమేనా.. అదే అసలైన సవాల్!

ABN , Publish Date - Feb 23 , 2025 | 06:47 PM

దుబాయ్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు అదరగొట్టారు. ఇక, భారమంతా బ్యాటర్లపైనే ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచి ముందుకు వెళ్లాలంటే బ్యాటర్లు ఆచితూచి ఆడాల్సిందే. గత మ్యాచ్‌లో బంగ్లాదేశ్ నిర్దేశించిన 229 పరుగులను ఛేదించడానికే భారత బ్యాటర్లు చెమటోడ్చారు.

Ind vs Pak: టార్గెట్ 242.. టీమిండియా బ్యాటర్లకు సులభమేనా.. అదే అసలైన సవాల్!
India vs Pakistan

దుబాయ్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు అదరగొట్టారు. ఇక, భారమంతా బ్యాటర్లపైనే ఉంది (Ind vs Pak). ఈ మ్యాచ్‌లో గెలిచి ముందుకు వెళ్లాలంటే బ్యాటర్లు ఆచితూచి ఆడాల్సిందే. గత మ్యాచ్‌లో బంగ్లాదేశ్ నిర్దేశించిన 229 పరుగులను ఛేదించడానికే భారత బ్యాటర్లు చెమటోడ్చారు. అలాంటిది పాక్ పేస్ త్రయం షాహిన్ ఆఫ్రిది, నషీమ్ షా, హర్షద్ రౌఫ్‌ను ఎదుర్కొని పరుగులు రాబట్టాలంటే భారత బ్యాటర్లు మరింత జాగ్రత్తగా ఆడాలి. దుబాయ్ పిచ్ చాలా స్లోగా ఉంది (Champions Trophy)


దుబాయ్ పిచ్ స్వింగ్‌కు, పేస్‌కు పెద్దగా అనుకూలించకపోయినా బ్యాట్‌ మీదకు బంతి అంత సులభంగా రావడం లేదు. స్లో బాల్స్, స్పిన్‌‌ కీలక పాత్ర పోషిస్తాయి. పాక్ బ్యాటర్లను ఇండియన్ స్పిన్నర్లు ఇబ్బందులు పెట్టారు. కుల్దీప్ 3, జడేజా, అక్షర్ చెరో వికెట్ పడగొట్టారు. ఈ పిచ్ మీద మొదటి బ్యాటింగ్‌తో పోల్చుకుంటే ఛేజింగ్ చేయడం కొంచెం కష్టంగా మారుతుంది. సులభంగా పరుగులు రావడం కష్టం. సహనంతో ఆడితేనే ఛేజింగ్ సులభమవుతుంది. ముఖ్యంగా విరాట్ కోహ్లీనే ఈ ఛేజింగ్‌లో కీలకంగా మారే అవకాశం ఉంది.


టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. పిచ్ స్లోగా ఉండడం, భారత బౌలర్లు నియంత్రణతో బౌలింగ్ చేయడంతో పాక్ బ్యాటర్లు ఆచితూచి ఆడారు. భారత బౌలర్లందరూ చాలా నియంత్రణగా బౌలింగ్ చేశారు. స్లో పిచ్‌పై తన స్పిన్ బౌలింగ్‌తో చెలరేగిన కుల్‌దీప్ మూడు వికెట్లు పడగొట్టాడు. హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు దక్కించుకున్నారు. హర్షిత్ రాణా, జడేజా, అక్షర్ పటేల్ ఒక్కో వికెట్ పడగొట్టారు. అక్షర్ పటేల్ అద్భుత ఫీల్డింగ్ చేసి ఇద్దరిని రనౌట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించాలంటే 242 పరుగులు చేయాలి.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Feb 23 , 2025 | 06:47 PM