Ind vs Pak: నిలకడగా ఆడుతున్న కోహ్లీ.. విజయం దిశగా టీమిండియా!
ABN , Publish Date - Feb 23 , 2025 | 09:11 PM
దుబాయ్ వేదికగా జరుగుతున్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అభిమానులకు కావాల్సిన మజా అందించింది. కొన్ని కోట్ల మంది టీవీ సెట్ల ముందు కూర్చుని ఈ మ్యాచ్‌ను వీక్షించారు. ఈ మ్యాచ్‌ను సామాన్య క్రికెట్ ప్రేమికులే కాదు.. సెలబ్రిటీల సైతం ఎంతో ఆసక్తిగా వీక్షిస్తున్నారు.

దుబాయ్ వేదికగా జరుగుతున్న భారత్-పాకిస్తాన్ (Ind vs Pak) మ్యాచ్ అభిమానులకు కావాల్సిన మజా అందించింది. కొన్ని కోట్ల మంది టీవీ సెట్ల ముందు కూర్చుని ఈ మ్యాచ్‌ను వీక్షించారు. ఈ మ్యాచ్‌ను సామాన్య క్రికెట్ ప్రేమికులే కాదు.. సెలబ్రిటీల సైతం ఎంతో ఆసక్తిగా వీక్షిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు పరిస్థితులకు తగ్గట్టు ఆడుతూ విజయాన్ని సునాయాసం చేశారు.
ముఖ్యంగా కింగ్ కోహ్లీ (84 బంతుల్లో 71) అర్ధశతకం సాధించి నిలకడగా ఆడుతున్నాడు. అతడికి శ్రేయస్ అయ్యర్ (52 బంతుల్లో 48) చక్కని సహకారం అందిస్తున్నాడు. శ్రేయస్ కొట్టిన 102 మీటర్ల భారీ సిక్స్ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. ప్రస్తుతం భారత్ 35 ఓవర్లలో 189 పరుగులు చేసింది.
టీమిండియా గెలవాలంటే ఇంకా 90 బంతుల్లో 53 పరుగులు చేయాలి. (Champions Trophy). 242 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ (20) వికెట్‌ను త్వరగానే కోల్పోయింది.. మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (46) మాత్రం చక్కని బౌండరీలతో అలరించాడు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..