Share News

Shubhman Gill: ఇంగ్లండ్ టార్గెట్ 608.. టీమిండియా 427/6 డిక్లేర్డ్..

ABN , Publish Date - Jul 05 , 2025 | 09:36 PM

ఇంగ్లండ్‌తో ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగుతున్న రెండో టెస్ట్‌‌లో టీమిండియా సంపూర్ణ ఆధిపత్యంలో ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. ఇంగ్లండ్ ముందు 600 పరుగుల భారీ టార్గెట్‌ను నిర్దేశించింది.

Shubhman Gill: ఇంగ్లండ్ టార్గెట్ 608.. టీమిండియా 427/6 డిక్లేర్డ్..
Shubhman Gill

ఇంగ్లండ్‌తో ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగుతున్న రెండో టెస్ట్‌‌లో టీమిండియా సంపూర్ణ ఆధిపత్యంలో ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. ఇంగ్లండ్ ముందు 608 పరుగుల భారీ టార్గెట్‌ను నిర్దేశించింది. తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీతో అలరించిన టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubhman Gill) రెండో ఇన్నింగ్స్‌లోనూ సత్తా చాటాడు. మరో భారీ శతకం సాధించాడు. ఇప్పటివరకు జరిగిన రెండు టెస్ట్‌ మ్యాచ్‌ల్లో గిల్‌కు ఇది మూడో సెంచరీ. తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగులకు ఆలౌట్ అయిన టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 427 పరుగులు చేసింది. (Ind vs Eng).


తొలి ఇన్నింగ్స్‌లో ఎంతో ఓర్పు, సంయమనంతో చూడ చక్కని ఇన్నింగ్స్ ఆడిన గిల్ రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం వేగంగా పరుగులు చేశాడు. మరో సెంచరీ చేశాడు. 127 బంతుల్లో 100 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు (Shubhman Gill Record). ఒక టెస్ట్ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన తొలి ఇండియన్ క్రికెటర్‌గా నిలిచాడు. తాజా మ్యాచ్‌లో గిల్ 369 పరుగులు చేశాడు. ఇంతకు ముందు ఈ రికార్డు సునీల్ గవాస్కర్ (344 వెస్టిండీస్‌పై) పేరిట ఉండేది. అలాగే ఒకే మ్యాచ్‌లో డబుల్ సెంచరీ, సెంచరీ సాధించిన రెండో భారత క్రికెటర్‌గా నిలిచాడు. ఓవరాల్‌గా తొమ్మిదో అంతర్జాతీయ క్రికెటర్‌గా నిలిచాడు.


టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు కోల్పోయి 400 పరుగులు చేసింది. గిల్‌తో పాటు రవీంద్ర జడేజా (69), రిషభ్ పంత్ (65), కేఎల్ రాహుల్ (55) హాఫ్ సెంచరీలు సాధించారు. ఎడ్జ్‌బాస్టన్ పిచ్ చాలా ఫ్లాట్‌గా ఉండడంతో టీమిండియా రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయడానికి ఎక్కువ సమయం తీసుకుంది. తొలి టెస్ట్‌లో చేసిన పొరపాటును తాజా టెస్ట్‌లో చేయకూడదని నిర్ణయించుకుని స్కోరు‌బోర్డు మీద ఎక్కువ పరుగులు ఉంచేందుకు ప్రయత్నించింది.


ఇవీ చదవండి:

ఆర్సీబీ స్టార్ సెన్సేషనల్ నాక్

సంజూ శాంసన్‌కు జాక్‌పాట్

టచ్ చేయలేని రికార్డులు!

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 05 , 2025 | 09:36 PM