Ind vs Eng: యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీ.. లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా 98/2
ABN , Publish Date - Jul 02 , 2025 | 05:58 PM
దాదాపు వారం రోజుల విరామం తర్వాత ఎడ్జ్‌బాస్టన్‌లో రెండో టెస్ట్ మొదలైంది. టాస్ గెలిచిన ఇంగ్లీష్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కు జట్టులో చోటు దక్కింది. స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను పక్కన పెట్టి మరీ వాషింగ్టన్ సుందర్‌ను తీసుకున్నారు.
ఇంగ్లండ్, టీమిండియా (Ind vs Eng) మధ్య రెండో టెస్ట్ ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ప్రారంభమైంది. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా లీడ్స్‌లో జరిగిన మొదటి టెస్ట్‌లో టీమిండియా (TeamIndia) ఓటమి పాలైన సంగతి తెలిసిందే. దాదాపు వారం రోజుల విరామం తర్వాత ఎడ్జ్‌బాస్టన్‌లో రెండో టెస్ట్ మొదలైంది. టాస్ గెలిచిన ఇంగ్లీష్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కు జట్టులో చోటు దక్కింది. స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను పక్కన పెట్టి మరీ వాషింగ్టన్ సుందర్‌ను తీసుకున్నారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆరంభంలోనే ఎదురు తిరిగింది. తొలి మ్యాచ్ సెంచరీ హీరో కేఎల్ రాహుల్ (2) 9 ఓవర్లోనే అవుటయ్యాడు. క్రిస్ వోక్స్ వేసిన బంతిని డిఫెన్స్ ఆడబోయి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే మరో ఎండ్‌లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi jaiswal) సమయోచితంగా రాణించాడు. 69 బంతుల్లో 11 ఫోర్లతో 62 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. రాహుల్ అవుట్ అయిన తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కరుణ్ నాయర్ (50 బంతుల్లో 31) ఫర్వాలేదనిపించాడు. జైస్వాల్, కరుణ్ నాయర్ రెండో వికెట్‌కు 80 పరుగులు జోడించారు.
లంచ్ బ్రేక్‌కు ముందు కరుణ్ నాయర్ అవుటయ్యాడు. బ్రైడన్ కార్స్ వేసిన 23.3వ బంతికి హ్యారీ బ్రూక్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. సెకెండ్ డౌన్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (1 నాటౌట్) బ్యాటింగ్‌కు దిగాడు. తొలి రోజు ఆటలో 25 ఓవర్లు పూర్తైన తర్వాత భోజన విరామ సమయానికి టీమిండియా 98/2తో నిలిచింది. క్రీజులో జైస్వాల్ (62 నాటౌట్), గిల్ (1 నాటౌట్) క్రీజులో ఉన్నారు.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి