Ind vs Eng: అహ్మదాబాద్ వన్డే.. టీమిండియా రికార్డులే రికార్డులు..
ABN , Publish Date - Feb 13 , 2025 | 07:09 AM
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఆఖరి వన్డేలో టీమిండియా 142 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై గెలుపొందింది. మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు పలు రికార్డులను నెలకొల్పారు. కెప్టెన్‌గా రోహిత్ శర్మ, బ్యాటర్లుగా కోహ్లీ, గిల్ పలు మైలు రాళ్లను చేరుకున్నారు.

అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా క్రికెటర్లు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టారు. మొదట బ్యాటర్లు మెరవగా, తర్వాత బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఆఖరి వన్డేలో టీమిండియా 142 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై గెలుపొందింది. మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు పలు రికార్డులను నెలకొల్పారు. కెప్టెన్‌గా రోహిత్ శర్మ, బ్యాటర్లుగా కోహ్లీ, గిల్ పలు మైలు రాళ్లను చేరుకున్నారు. (Ind vs Eng)
రోహిత్ శర్మ నాయకత్వంలో టీం ఇండియా నాలుగు ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లను క్లీన్ స్వీప్ చేసింది. దీంతో ఎక్కువ క్లీన్‌స్వీప్‌లు చేసిన తొలి భారత కెప్టెన్‌గా రోహిత్ నిలిచాడు. రోహిత్ నాయకత్వంలో టీమిండియా.. వెస్టిండీస్, శ్రీలంక, న్యూజిలాండ్, తాజాగా ఇంగ్లండ్‌పై వైట్‌వాష్ చేసింది. గతంలో విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీల నాయకత్వంలో టీమిండియా మూడేసి సార్లు ప్రత్యర్థులను క్లీన్‌స్వీప్ చేసింది. ఇక, గత 14 సంవత్సరాలలో భారత జట్టు వన్డే సిరీస్‌లలో అత్యధిక క్లీన్ స్వీప్‌లను సాధించిన జట్టుగా నిలిచింది. టీమిండియా గత 14 ఏళ్లలో 12 సార్లు వన్డే సిరీస్‌లను క్లీన్ స్వీప్ చేసింది. న్యూజిలాండ్ 10 క్లీన్ స్వీప్‌లతో రెండో స్థానంలో ఉంది. (TeamIndia Records)
తాజా వన్డేలో హాఫ్ సెంచరీ సాధించిన విరాట్ కోహ్లీ ఆసియా గడ్డపై అంతర్జాతీయ క్రికెట్‌లో 16 వేల పరుగులను పూర్తి చేశాడు. ఈ ఘనతను సాధించడానికి సచిన్ 353 ఇన్సింగ్స్‌లు ఆడగా, విరాట్‌కు 340 ఇన్నింగ్స్‌లు మాత్రమే పట్టాయి. ఇక, యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కూడా పలు రికార్డులు నమోదు చేశాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో శుభ్‌మాన్ గిల్ మూడు ఫార్మాట్లలో సెంచరీలు సాధించాడు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ ఆటగాడు అతనే. అలాగే వన్డేల్లో అత్యంత వేగంగా 2500 పరుగులు చేసిన ఆటగాడిగా కూడా రికార్డు నెలకొల్పాడు. అలాగే తక్కువ ఇన్నింగ్స్‌లలోనే ఏడు వన్డే సెంచరీలు చేసిన ఆటగాడిగా కూడా రికార్డు నెలకొల్పాడు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..