IND VS AUS T20: గెలుపు కోసం పోరాడుతున్న భారత్..
ABN , Publish Date - Nov 02 , 2025 | 04:50 PM
హోబర్ట్ వేదికగా జరుగుతున్న మూడో టీ 20లో భారత్ గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తుంది. అభిషేక్ శర్మ, గిల్, సూర్యకుమార్ యాదవ్ లాంటి మూడు కీలక వికెట్లు కోల్పోయినప్పటికీ మ్యాచ్ పై మాత్రం పట్టు వదల్లేదు.
క్రీడా వార్తలు: హోబర్ట్ వేదికగా జరుగుతున్న మూడో టీ 20లో భారత్ గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తుంది. అభిషేక్ శర్మ, గిల్, సూర్యకుమార్ యాదవ్ లాంటి మూడు కీలక వికెట్లు కోల్పోయినప్పటికీ మ్యాచ్ పై మాత్రం పట్టు వదల్లేదు. తిలక్ వర్మ(29*), వాషింగ్టన్ సుందర్(29*) పోరాడుతున్నారు. 187 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్.. ఆది నుంచి దూకుడుగానే ఆడింది. ఈ క్రమంలో మూడు ఓవర్లకే 30 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ(16 బంతుల్లో 25 పరుగులు), సూర్యకుమార్ యాదవ్(11 బంతుల్లో 24 పరుగులు) దూకుడుగా ఆడటంతో విజయం దిశగా సాగింది. ఇక 33 పరుగుల వద్ద అభిషేక్ శర్మ, 61 పరుగుల వద్ద గిల్, 76 పరుగుల వద్ద సూర్య కుమార్ యాదవ్ ఔటయ్యారు. ఆ తర్వాతా 111 వద్ద అక్షర్ పటేల్ ఔటయ్యాడు. ప్రస్తుతం భారత్ స్కోర్ 13 ఓవర్లకు 126/4 గా ఉంది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి.. 186 పరుగులు చేసింది. టిమ్ డేవిడ్( 74), మార్కస్ స్టోయినిష్(64) హాఫ్ సెంచరీలతో మెరిశారు. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ 3, వరుణ్ చక్రవర్తి 2, శివం దూబె 1 వికెట్ తీశారు. రెండో టీ 20 మ్యాచ్ లో భారత్ ఘోరంగా ఓడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ గెలిచి.. ప్రతీకారం తీర్చుకోవాలనే కసి..భారత్ బ్యాటర్లలో కనిపిస్తున్నట్లు ఉంది. అందుకే తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్ ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Women's WC 2025: టాస్ గెలిచిన సౌతాఫ్రికా..
Harmanpreet Kaur: విజయాన్ని ఆస్వాదించాలనుకుంటున్నాం: హర్మన్