IND vs AUS: టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే..
ABN , Publish Date - Oct 19 , 2025 | 08:59 AM
ఆస్ట్రేలియాలో మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా ప్రారంభించింది. శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని టీమిండియా చాలా నెలల తర్వాత ఆస్ట్రేలియాలో ఓ వన్డే సిరీస్ ఆడబోతోంది. అలాగే ఏడు నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఓ వన్డే సిరీస్ ఆడనుంది.
ఆస్ట్రేలియాలో మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా ప్రారంభించింది. శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని టీమిండియా చాలా నెలల తర్వాత ఆస్ట్రేలియాలో ఓ వన్డే సిరీస్ ఆడబోతోంది. అలాగే ఏడు నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఓ వన్డే సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు పెర్త్‌లో తొలి వన్డే మ్యాచ్ ప్రారంభం కాబోతోంది (India vs Australia 2025).
ఈ వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియా జట్టుకు మిచెల్ మార్ష్ సారథ్యం వహించనున్నాడు. టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ బౌలింగ్ ఎంచుకున్నాడు (IND vs AUS toss). దీంతో టీమిండియా బ్యాటింగ్‌కు రెడీ అవుతోంది. తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డికి తుది జట్టులో స్థానం దక్కింది. జస్ప్రీత్ బుమ్రా లేకుండానే టీమిండియా బరిలోకి దిగుతోంది.
తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్
ఆస్ట్రేలియా: ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, మాథ్యూ షార్ట్, జోష్ ఫిలిప్, మ్యాట్ రెన్‌షా, కూపర్ కానోలి, మిచెల్ ఓవెన్, మిచెల్ స్టార్క్, నాథన్ ఎల్లిస్, మాథ్యూ కున్హెమన్, జోష్ హాజెల్‌వుడ్
ఇవి కూడా చదవండి..
పోక్సో కేసుల పరంపర.. తల్లిదండ్రుల ఆందోళన
పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగులయ్యకు కేటీఆర్ అండ