Ind vs Aus 1st ODI: మ్యాచ్ పున:ప్రారంభం.. మ్యాచ్ 35 ఓవర్లకు కుదింపు..
ABN , Publish Date - Oct 19 , 2025 | 12:36 PM
పెర్త్‌లో ప్రారంభమైన తొలి వన్డేకు వర్షం అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోంది. ఎన్నో అంచనాలతో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ను ప్రారంభించిన టీమిండియా పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. అయితే వరుణుడు అడ్డుకోవడం కాస్త కలిసొచ్చేలా కనిపిస్తోంది.
పెర్త్‌లో ప్రారంభమైన తొలి వన్డేకు వర్షం అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోంది. ఎన్నో అంచనాలతో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ను ప్రారంభించిన టీమిండియా పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. అయితే వరుణుడు అడ్డుకోవడం కాస్త కలిసొచ్చేలా కనిపిస్తోంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాను ఆస్ట్రేలియా పేసర్లు బెంబేలెత్తించారు. దాంతో టీమిండియా ఆరంభంలోనే టాపార్డర్ వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ ఆటకు వర్షం ఆటంకం కలిగించింది (IND lost early wickets).
చాలా రోజుల విరామం తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తీవ్రంగా నిరాశపరిచారు. ఓపెనర్ రోహిత్ శర్మ 8 పరుగులకే హాజెల్‌వుడ్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఆ వెంటనే కోహ్లీ కూడా వెనుదిరిగాడు. 8 బంతులు ఆడి ఒక్క పరుగు కూడా చేయకుండానే మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. ఇక, రెండు ఫోర్లు కొట్టి మంచి టచ్‌లో కనిపించిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (10) నాథన్ ఎల్లిస్ బౌలింగ్‌లో అవుటయ్యాడు (IND vs AUS live score). మ్యాచ్ ప్రారంభమైన తర్వాత శ్రేయస్ అయ్యర్ (11) హాజెల్‌వుడ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.
ఇప్పటికే పలుసార్లు మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించాడు (India top order failure). ఇప్పటివరకు కేవలం 14 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. దాదాపు రెండు గంటల ఆట వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోయింది. దీంతో మ్యాచ్‌ను 35 ఓవర్లకు కుదించారు. ఐదుగురు బౌలర్లకు గరిష్టంగా 7 ఓవర్లు వేసేందుకు వీలుంది. ప్రస్తుతం కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ క్రీజులో ఉన్నారు. టీమిండియా ప్రస్తుతం 14 ఓవర్లలో 45/4తో ఆడుతోంది.
ఇవి కూడా చదవండి..
టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే..
ఆస్ట్రేలియాతో తొలి వన్డే మ్యాచ్.. రోహిత్ కోసం వెయిట్ చేస్తున్న రికార్డులు..
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..