Share News

Ind vs Aus 1st ODI: కీలక వికెట్లు కోల్పోయిన టీమిండియా.. మ్యాచ్ 49 ఓవర్లకు కుదింపు..

ABN , Publish Date - Oct 19 , 2025 | 10:10 AM

ఎన్నో అంచనాలతో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ను ప్రారంభించిన టీమిండియా పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. పెర్త్‌లో ప్రారంభమైన తొలి వన్డేలో తడబడుతోంది. కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాను ఆస్ట్రేలియా పేసర్లు బెంబేలెత్తిస్తున్నారు.

Ind vs Aus 1st ODI: కీలక వికెట్లు కోల్పోయిన టీమిండియా.. మ్యాచ్ 49 ఓవర్లకు కుదింపు..
Virat Kohli

ఎన్నో అంచనాలతో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ను ప్రారంభించిన టీమిండియా పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. పెర్త్‌లో ప్రారంభమైన తొలి వన్డేలో తడబడుతోంది. కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాను ఆస్ట్రేలియా పేసర్లు బెంబేలెత్తిస్తున్నారు. దాంతో టీమిండియా ఆరంభంలోనే టాపార్డర్ వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ ఆటకు వర్షం ఆటంకం కలిగించింది (IND lost early wickets).


చాలా రోజుల విరామం తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తీవ్రంగా నిరాశపరిచారు. ఓపెనర్ రోహిత్ శర్మ 8 పరుగులకే హాజెల్‌వుడ్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఆ వెంటనే కోహ్లీ కూడా వెనుదిరిగాడు. 8 బంతులు ఆడి ఒక్క పరుగు కూడా చేయకుండానే మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. ఇక, రెండు ఫోర్లు కొట్టి మంచి టచ్‌లో కనిపించిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (10) నాథన్ ఎల్లిస్ బౌలింగ్‌లో అవుటయ్యాడు (IND vs AUS live score).


9వ ఓవర్లో మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించాడు (India top order failure). వర్షం రావడంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేశారు. వర్షం తగ్గిన తర్వాత 14 నిమిషాల విరామం అనంతరం మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది. మ్యాచ్‌ను 49 ఓవర్లకు కుదించారు. నలుగురు బౌలర్లు 10 ఓవర్లు, ఒక్క బౌలర్ 9 ఓవర్లు వేసేందుకు వీలుంది. ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ క్రీజులో ఉన్నారు. టీమిండియా ప్రస్తుతం 10 ఓవర్లలో 27/3తో ఆడుతోంది.


ఇవి కూడా చదవండి..

టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే..


ఆస్ట్రేలియాతో తొలి వన్డే మ్యాచ్.. రోహిత్ కోసం వెయిట్ చేస్తున్న రికార్డులు..


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Oct 19 , 2025 | 10:11 AM