Share News

ICC Rejects PCB Demand: పైక్రాఫ్ట్‌ను తొలగించం

ABN , Publish Date - Sep 17 , 2025 | 06:11 AM

‘కరచాలన వివాదం’ నేపథ్యంలో మ్యాచ్‌ రెఫరీ ఆండీ పైక్రా్‌ఫ్టను తప్పించాలన్న పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) డిమాండ్‌ను ఐసీసీ తిరస్కరించింది. ఆసియాకప్‌ మ్యాచ్‌ టాస్‌ సందర్భంగా భారత కెప్టెన్‌...

ICC Rejects PCB Demand: పైక్రాఫ్ట్‌ను తొలగించం

పీసీబీ ఫిర్యాదును తిరస్కరించిన ఐసీసీ

దుబాయ్‌: ‘కరచాలన వివాదం’ నేపథ్యంలో మ్యాచ్‌ రెఫరీ ఆండీ పైక్రా్‌ఫ్టను తప్పించాలన్న పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) డిమాండ్‌ను ఐసీసీ తిరస్కరించింది. ఆసియాకప్‌ మ్యాచ్‌ టాస్‌ సందర్భంగా భారత కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌తో కరచాలనం చేయవద్దంటూ పాక్‌ సారథి సల్మాన్‌ ఆఘాకు పైకారఫ్ట్‌ (జింబాబ్వే) సూచించాడని ఐసీసీకు పీసీబీ ఫిర్యాదు చేసిన విషయం విదితమే. అయితే, పాక్‌ డిమాండ్‌ను తిరస్కరిస్తూ పీసీబీకి మెయిల్‌ పంపినట్టు ఐసీసీ వర్గాలు తెలిపాయి. బుధవారం పాక్‌, యూఏఈ మధ్య జరిగే మ్యాచ్‌కు కూడా పైక్రాఫ్ట్‌ మ్యాచ్‌ రెఫరీగా వ్యవహరించాల్సి ఉంది. అయితే, పైక్రా్‌ఫ్టను తప్పించడానికి ఐసీసీ విముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలో తమ మ్యాచ్‌లకు అతడిని దూరంగా ఉంచాలని పీసీబీ కోరే అవకాశం ఉంది. మధ్యే మార్గంగా రిచీ రిచర్డ్సన్‌ (వెస్టిండీ్‌స)ను రెఫరీగా నియమించాలని సూచించనున్నట్టు సమాచారం. ఆదివారం పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలిచిన తర్వాత భారత ఆటగాళ్లు ప్రత్యర్థులతో హ్యాండ్‌ షేక్‌ చేయకుండా రావడం చర్చనీయాంశమైంది. పహల్గాం బాధితులకు సంఘీభావంగానే తాము ఇలా చేసినట్టు సూర్యకుమార్‌ చెప్పాడు.

బహిష్కరిస్తే.. రూ. 141 కోట్ల నష్టం

రెఫరీ పైక్రాఫ్ట్‌ను తొలగించకపోతే టోర్నీని బహిష్కరిస్తామని ఒకానొక సమయంలో పాక్‌ బీరాలు పలికింది. అయితే, అది సాధ్యమయ్యే పని కాదని పాక్‌ బోర్డు వర్గాలు చెప్పాయి. టోర్నీని బహిష్కరిస్తే ఐసీసీ తమపై భారీగా జరిమానాలు విధించే అవకాశం ఉందని తెలిపాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అంత భారం పీసీబీ భరించలేదని వెల్లడించాయి. ఒకవేళ పాక్‌ జట్టు టోర్నీని బాయ్‌కాట్‌ చేస్తే టోర్నీ ఆదాయంలో 15 శాతం రెవెన్యూ.. అంటే సుమారు రూ. 106 నుంచి 141 కోట్ల మేర ఆదాయాన్ని కూడా పీసీబీ నష్టపోనుంది.

ఇవి కూడా చదవండి

ఆసియా కప్ మ్యాచ్ రెఫరీని తప్పించాలంటున్న పీసీబీ.. ఐసీసీ తిరస్కరించే ఛాన్స్

పాక్ క్రీడాకారులతో మాట కలపని భారత ప్లేయర్లు.. సైలెంట్ బాయ్‌కాట్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 17 , 2025 | 06:14 AM