Hyderabad Cricket Team: హైదరాబాద్‌దే బుచ్చిబాబు ట్రోఫీ
ABN , Publish Date - Sep 10 , 2025 | 05:10 AM
ఆలిండియా బుచ్చిబాబు టోర్నమెంట్‌లో డిఫెండింగ్ చాంప్ హైదరాబాద్ జట్టు టైటిల్ నిలబెట్టుకుంది. ఫైనల్లో తమిళనాడు ప్రెసిడెంట్స్ లెవన్‌పై గెలిచింది....
చెన్నై: ఆలిండియా బుచ్చిబాబు టోర్నమెంట్‌లో డిఫెండింగ్ చాంప్ హైదరాబాద్ జట్టు టైటిల్ నిలబెట్టుకుంది. ఫైనల్లో తమిళనాడు ప్రెసిడెంట్స్ లెవన్‌పై గెలిచింది. ఆఖరి రోజైన మంగళవారం ఓవర్‌నైట్ స్కోరు 14/1తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్ జట్టు.. ఆట ముగిసేసరికి 70 ఓవర్లలో 155/5 స్కోరు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఆధారంగా హైదరాబాద్ జట్టును విజేతగా ప్రకటించారు. తొలి ఇన్నింగ్స్‌లో హైదరాబాద్ 376, తమిళనాడు 353 పరుగులు చేశాయి.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి