Ranji Trophy 2025: హైదరాబాద్‌కు మరో డ్రా
ABN , Publish Date - Nov 12 , 2025 | 05:46 AM
గ్రూప్-డిలో రాజస్థాన్‌తో రంజీ మ్యాచ్‌ను హైదరాబాద్ డ్రాగా ముగించింది. అయి తే, తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కారణంగా హైదరాబాద్‌కు 3 పాయింట్లు, రాజస్థాన్‌కు ఓ పాయింట్ లభించాయి. హైదరాబాద్ నిర్దేశించిన...
హైదరాబాద్: గ్రూప్-డిలో రాజస్థాన్‌తో రంజీ మ్యాచ్‌ను హైదరాబాద్ డ్రాగా ముగించింది. అయి తే, తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కారణంగా హైదరాబాద్‌కు 3 పాయింట్లు, రాజస్థాన్‌కు ఓ పాయింట్ లభించాయి. హైదరాబాద్ నిర్దేశించిన 340 పరుగుల లక్ష్య ఛేదనలో ఆటకు నాలుగో, ఆఖరి రోజైన మంగళవారం రాజస్థాన్ రెండో ఇన్నింగ్స్‌లో 207/3 స్కోరు చేసింది. ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో కెప్టెన్లు డ్రాకు అంగీకరించారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 198/7తో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన హైదరాబాద్ 244/9 వద్ద డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో హైదరాబాద్ 364, రాజస్థాన్ 269 రన్స్ చేశాయి.
రాజస్థాన్‌తో రంజీ
జమ్మూ సంచలనం
ఇదే గ్రూప్‌లో జరిగిన మరో మ్యాచ్‌లో జమ్మూ కశ్మీర్ సంచలనం సృష్టించింది. గత 65 ఏళ్లలో ఢిల్లీపై తొలిసారి నెగ్గింది. కమ్రాన్ ఇక్బాల్ (133 నాటౌట్) సెంచరీతో రాణించడంతో.. జమ్మూ 7 వికెట్లతో ఢిల్లీని చిత్తు చేసింది. 179 పరుగుల ఛేదనలో ఆటకు నాలుగో, ఆఖరి రోజు ఓవర్‌నైట్ స్కోరు 55/2తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన జమ్మూ 179/3 స్కోరు చేసి గెలిచింది. ఢిల్లీ 211, 277 స్కోర్లు చేయగా.. జమ్మూ కశ్మీర్ తొలి ఇన్నింగ్స్‌లో 310 పరుగులు సాధించింది.
ఇవి కూడా చదవండి
అందుకే పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేయలేదు: సూర్యకుమార్
పాక్ క్రీడాకారులతో మాట కలపని భారత ప్లేయర్లు.. సైలెంట్ బాయ్‌కాట్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి