Ranji Trophy 2025: ఢిల్లీతో హైదరాబాద్ రంజీ డ్రా
ABN , Publish Date - Oct 19 , 2025 | 05:19 AM
బ్యాటర్ల వైఫల్యంతో హైదరాబాద్ కీలక పాయింట్లు కోల్పోయింది. గ్రూప్-డిలో ఢిల్లీతో రంజీ మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. అయితే...
హైదరాబాద్: బ్యాటర్ల వైఫల్యంతో హైదరాబాద్ కీలక పాయింట్లు కోల్పోయింది. గ్రూప్-డిలో ఢిల్లీతో రంజీ మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. అయితే, తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఆధారంగా ఢిల్లీకి 3, హైదరాబాద్‌కు ఒక పాయింట్ లభించాయి. ఆటకు నాలుగో, ఆఖరి రోజు ఓవర్‌నైట్ స్కోరు 400/7తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్ 411 రన్స్‌కు ఆలౌటైంది. ఆయుష్ బదోనికి 6, అర్పిత్ రాణాకు 3 వికెట్లు దక్కాయి. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో ఢిల్లీ 138/3 స్కోరు చేసింది. తొలి ఇన్నింగ్స్‌ను ఢిల్లీ 529/4 వద్ద డిక్లేర్ చేసింది. కాగా, గ్రూప్-ఎలో యూపీతో మ్యాచ్‌ను ఆంధ్ర డ్రాగా ముగించింది.
ఇవి కూడా చదవండి..
ఆస్ట్రేలియా పర్యటనకు మంత్రి లోకేష్.. ఎన్ని రోజులంటే
ఉద్యోగ సంఘాలతో సర్కార్ కీలక చర్చలు
Read Latest AP News And Telugu News