Share News

BFI Cup: ఫైనల్లో హుస్సాముద్దీన్‌

ABN , Publish Date - Oct 07 , 2025 | 05:51 AM

తెలుగు బాక్సర్‌ మొహమ్మద్‌ హుస్సాముద్దీన్‌ బీఎ్‌ఫఐ కప్‌ ఫైనల్లో ప్రవేశించి పతకం ఖాయం చేసుకున్నాడు. సోమవారం జరిగిన పురుషుల 55-60 కిలోల సెమీస్‌...

BFI Cup: ఫైనల్లో హుస్సాముద్దీన్‌

చెన్నై: తెలుగు బాక్సర్‌ మొహమ్మద్‌ హుస్సాముద్దీన్‌ బీఎ్‌ఫఐ కప్‌ ఫైనల్లో ప్రవేశించి పతకం ఖాయం చేసుకున్నాడు. సోమవారం జరిగిన పురుషుల 55-60 కిలోల సెమీస్‌ బౌట్‌లో హుస్సాముద్దీన్‌ 5-0తో మితేష్‌ దేశ్వాల్‌ (రైల్వేస్‌)ను చిత్తుగా ఓడించాడు. మిగతా బాక్సర్లలో మాజీ వరల్డ్‌ చాంపియన్‌ అనుక్షిత బోరో, అరుంధతి చౌధురి స్వర్ణాలు సాధించారు. అనుక్షిత (అసోం) 60-65 కిలోల కేటగిరీ ఫైనల్లో 3-2తో పార్థవి (రాజస్థాన్‌)పై, 65-70 కిలోల ఫైనల్‌ బౌట్‌లో అరుంధతి (సర్వీసెస్‌) 5-0తో స్నేహ (ఏఐపీ)పై విజయం సాధించారు. 45-48 కిలోల ఫైనల్లో నివేదిత (ఉత్తరాఖండ్‌) 3-2తో మంజు రాణి (రైల్వే్‌స)ని ఓడించి విజేతగా నిలిచింది. భావన శర్మ (రైల్వేస్‌) 5-0తో సవిత (రైల్వే్‌స)పై నెగ్గి బంగారు పతకం దక్కించుకుంది.

ఇవి కూడా చదవండి..

ఈసారి ఎన్నికలు ఈ ముగ్గురికీ యాసిడ్ టెస్ట్

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల, జూబ్లీహిల్స్ బైపోల్ కూడా..

Read Latest Telangana News and National News

Updated Date - Oct 07 , 2025 | 05:51 AM