HCA bank account: హెచ్‌సీఏ బ్యాంకు ఖాతాను పునరుద్ధరించండి
ABN , Publish Date - Sep 12 , 2025 | 05:02 AM
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) బ్యాంకు ఖాతాను పునరుద్ధరించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిధుల దుర్వినియోగం కేసులో ఆ సంఘం బ్యాంకు ఖాతాను...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) బ్యాంకు ఖాతాను పునరుద్ధరించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిధుల దుర్వినియోగం కేసులో ఆ సంఘం బ్యాంకు ఖాతాను సీఐడీ సూచనల మేరకు కెనరా బ్యాంకు అధికారులు స్తంభింపజేశారు. ఖాతా స్తంభనను హెచ్‌సీఏ తాత్కాలిక సీఈఓ ఇంతియాజ్ హైకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ శ్రవణ్ ధర్మాసనం, సీఐడీ పెట్టిన కేసులో కార్యవర్గ సభ్యులు నిందితులుగా ఉన్నారే కానీ హెచ్‌సీఏ కాదని, సీఐడీ పెట్టిన కేసుకు సంఘం రోజువారీ కార్యకలాపాల నిర్వహణకు సంబంధం లేదని ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఇవి కూడా చదవండి
నిఖత్‌కు నిరాశ క్వార్టర్స్‌లో ఓటమి
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి