Share News

Under 19 Cricket: హెనిల్‌ ఖిలన్‌ ఆల్‌రౌండ్‌ షో

ABN , Publish Date - Oct 08 , 2025 | 02:43 AM

పటేల్‌ ద్వయం హెనిల్‌ (3/21, 22 నాటౌట్‌), ఖిలన్‌ (3/23, 26) ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో.. అండర్‌-19 రెండో అనధికార టెస్ట్‌ తొలి రోజు భారత్‌ 9 పరుగుల ఆధిక్యాన్ని...

Under 19 Cricket: హెనిల్‌ ఖిలన్‌ ఆల్‌రౌండ్‌ షో

రెండో యూత్‌ టెస్ట్‌

  • ఆసీస్‌ 135 ఆలౌట్‌ ఫ భారత్‌ 144/7

మెకే (ఆస్ట్రేలియా): పటేల్‌ ద్వయం హెనిల్‌ (3/21, 22 నాటౌట్‌), ఖిలన్‌ (3/23, 26) ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో.. అండర్‌-19 రెండో అనధికార టెస్ట్‌ తొలి రోజు భారత్‌ 9 పరుగుల ఆధిక్యాన్ని నమోదు చేసింది. నాలుగు రోజుల ఈ టెస్ట్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకొన్న ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 135 పరుగులకే కుప్పకూలింది. అలెక్స్‌ (66) అర్ధ శతకం సాధించాడు. ఉద్ధవ్‌ మోహన్‌ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన భారత్‌ 144/7 స్కోరు చేసింది. మొదటి రోజు ఆట ఆఖరుకు హెనిల్‌తోపాటు దేవేంద్రన్‌ (6 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నాడు. వేదాంత్‌ త్రివేది (22), వైభవ్‌ సూర్యవంశీ (20) ఫర్వాలేదనిపించారు. బార్టన్‌ మూడు వికెట్లు పడగొట్టాడు.

ఈ వార్తలు కూడా చదవండి..

పీఎంఓ పేరిట మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్..!

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 08 , 2025 | 02:43 AM