Share News

India Versus South Africa T20: వచ్చాడు గెలిపించాడు

ABN , Publish Date - Dec 10 , 2025 | 05:56 AM

టీ20 ప్రపంచకప్‌ సన్నాహకాలను డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత జట్టు ఘనంగా ఆరంభించింది. గాయంతో సుదీర్ఘ బ్రేక్‌ తర్వాత బరిలోకి దిగిన హార్దిక్‌ పాండ్యా (28 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 59 నాటౌట్‌) అజేయ అర్ధసెంచరీతో చెలరేగగా..

India Versus South Africa T20: వచ్చాడు గెలిపించాడు

హార్దిక్‌ ఆల్‌రౌండ్‌ షో

సఫారీలు 74 రన్స్‌కే ఆలౌట్‌

తొలి టీ20లో భారత్‌ ఘన విజయం

కటక్‌: టీ20 ప్రపంచకప్‌ సన్నాహకాలను డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత జట్టు ఘనంగా ఆరంభించింది. గాయంతో సుదీర్ఘ బ్రేక్‌ తర్వాత బరిలోకి దిగిన హార్దిక్‌ పాండ్యా (28 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 59 నాటౌట్‌) అజేయ అర్ధసెంచరీతో చెలరేగగా.. ఆ తర్వాత బౌలర్లు మూకుమ్మడిగా దక్షిణాఫ్రికాపై విరుచుకుపడ్డారు. దీంతో మంగళవారం జరిగిన ఈ తొలి టీ20లో సూర్య సేన 101 పరుగులతో భారీ విజయం అందుకుంది. తద్వారా ఐదు టీ20ల సిరీ్‌సలో 1-0తో ఆధిక్యం సాధించింది. ముందుగా భారత్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 175 పరుగులు చేసింది. తిలక్‌ (26), అక్షర్‌ (23) ఫర్వాలేదనిపించారు. పేసర్లు ఎన్‌గిడికి 3, సిపమ్లాకు 2 వికెట్లు లభించాయి. ఛేదనలో సౌతాఫ్రికా 12.3 ఓవర్లలో 74 పరుగులకే కుప్పకూలింది. బ్రెవిస్‌ (22) టాప్‌ స్కోరర్‌. అర్ష్‌దీప్‌, బుమ్రా, వరుణ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా హార్దిక్‌ పాండ్యా నిలిచాడు.

వికెట్ల జాతర: లక్ష్య ఛేదనలో సఫారీలు తొలి ఓవర్‌ నుంచే తడబడ్డారు. భారత బౌలర్ల సమష్ఠి ప్రదర్శన ముందు నిలవలేకపోయారు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోగా.. బ్రెవిస్‌ ఒక్కడే కాస్త ఫర్వాలేదనిపించాడు. భారత్‌ తరఫున బౌలింగ్‌కు దిగిన ఆరుగురు కూడా వికెట్లు తీశారు. 50 పరుగులకే సగం జట్టు పెవిలియన్‌కు చేరడంతో దక్షిణాఫ్రికా మరిక కోలుకోలేకపోయింది. పేసర్‌ అర్ష్‌దీప్‌ ఇన్నింగ్స్‌ రెండో బంతికే డికాక్‌ (0) వికెట్‌ తీయగా, పవర్‌ప్లేలో స్టబ్స్‌ (14), మార్‌క్రమ్‌ (14) కూడా వెనుదిరిగారు. ఈ దశలో బ్రెవి్‌సతో పాటు యాన్సెన్‌ (12) ఎదురుదాడికి దిగే ప్రయత్నం చేసినా అప్పటికే మ్యాచ్‌ చేజారింది. కేవలం ఆరు పరుగుల వ్యవధిలోనే చివరి ఐదు వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా కనీసం వంద పరుగులైనా చేయలేక ఆటను ముగించింది.


హార్దిక్‌ అదుర్స్‌: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ ఇన్నింగ్స్‌లో హార్దిక్‌ ధనాధన్‌ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. మ్యాచ్‌ ప్రాక్టీస్‌ పెద్దగా లేకపోయినా అదిరే స్ట్రోక్‌ప్లేతో సఫారీ బౌలర్లను సునాయాసంగా ఆడేశాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా తను మాత్రం ఎడాపెడా బౌండరీలతో ఆఖరి ఆరు ఓవర్లలో 71 పరుగులు అందించి భారీ స్కోరుకు తోడ్పడ్డాడు. పేసర్‌ ఎన్‌గిడి తొలి ఓవర్‌లో ఓపెనర్‌ గిల్‌ (4), మూడో ఓవర్‌లో కెప్టెన్‌ సూర్య (11)ను అవుట్‌ చేయగా 17 రన్స్‌కే జట్టు రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో మరో ఓపెనర్‌ అభిషేక్‌ (17)-తిలక్‌ జోడీ మూడో వికెట్‌కు 31 పరుగులు జోడించింది. భారీ షాట్లు ఆడలేకపోయిన అభిషేక్‌ ఏడో ఓవర్‌లో వెనుదిరిగాడు. అయితే క్రీజులో ఇద్దరు ఎడమచేతి బ్యాటర్లను ఉంచాలనే లక్ష్యంతో హార్దిక్‌కన్నా ముందు అక్షర్‌ను పంపినా తను వేగం చూపలేదు. నిదానంగా ఆడిన తిలక్‌ను 12వ ఓవర్‌లో ఎన్‌గిడి అవుట్‌ చేశాడు. అప్పటికి స్కోరు 78/4. ఈ పరిస్థితిలో 150 కూడా కష్టమే అనిపించినా హార్దిక్‌ రాకతో సీన్‌ మారింది. తానెదుర్కొన్న తొలి నాలుగు బంతుల్లోనే రెండు సిక్సర్లు బాది స్టేడియంలో జోష్‌ నింపాడు. అక్షర్‌ 14వ ఓవర్‌లో వెనుదిరగ్గా, అటు పాండ్యా మాత్రం ధాటిని ఆపలేదు. నోకియా ఓవర్‌లో రెండు ఫోర్లు బాదగా, అటు దూబే (11) సైతం ఎన్‌గిడి ఓవర్‌లో మరో రెండు ఫోర్లతో సహకరించాడు. ఐదో వికెట్‌కు వీరి మధ్య 33 పరుగులు జత చేరాయి. 19వ ఓవర్‌లో హార్దిక్‌ 6,4.. జితేశ్‌ (10 నాటౌట్‌) 6తో 18 రన్స్‌ వచ్చాయి. ఇక ఆఖరి ఓవర్‌లో 6,4తో హార్దిక్‌ 25 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేసి స్కోరును 170 దాటించాడు.


స్కోరుబోర్డు

భారత్‌: అభిషేక్‌ (సి) యాన్సెన్‌ (బి) సిపమ్లా 17, గిల్‌ (సి) యాన్సెన్‌ (బి) ఎన్‌గిడి 4, సూర్య (సి) మార్‌క్రమ్‌ (బి) ఎన్‌గిడి 12, తిలక్‌ (సి) యాన్సెన్‌ (బి) ఎన్‌గిడి 26, అక్షర్‌ (సి) ఫెరీరా (బి) సిపమ్లా 23, హార్దిక్‌ (నాటౌట్‌) 59, దూబే (బి) ఫెరీరా 11, జితేశ్‌ (నాటౌట్‌) 10; ఎక్స్‌ట్రాలు: 13; మొత్తం: 20 ఓవర్లలో 175/6. వికెట్ల పతనం: 1-5, 2-17, 3-48, 4-78, 5-104, 6-137. బౌలింగ్‌: ఎన్‌గిడి 4-0-31-3, యాన్సెన్‌ 4-0-23-0, సిపమ్లా 4-0-38-2, నోకియా 4-0-41-0, కేశవ్‌ 2-0-25-0, ఫెరీరా 2-0-13-1.

దక్షిణాఫ్రికా: డికాక్‌ (సి) అభిషేక్‌ (బి) అర్ష్‌దీప్‌ 0, మార్‌క్రమ్‌ (బి) అక్షర్‌ 14, స్టబ్స్‌ (సి) జితేశ్‌ (బి) అర్ష్‌దీప్‌ 14, బ్రెవిస్‌ (సి) సూర్య (బి) బుమ్రా 22, మిల్లర్‌ (సి) జితేశ్‌ (బి) హార్దిక్‌ 1, ఫెరీరా (సి) జితేశ్‌ (బి) వరుణ్‌ 5, యాన్సెన్‌ (బి) వరుణ్‌ 12, కేశవ్‌ (సి) జితేశ్‌ (బి) బుమ్రా 0, నోకియా (బి) అక్షర్‌ 1, సిపమ్లా (సి) అభిషేక్‌ (బి) దూబే 2, ఎన్‌గిడి (నాటౌట్‌) 2, ఎక్స్‌ట్రాలు: 1; మొత్తం: 12.3 ఓవర్లలో 74 ఆలౌట్‌. వికెట్ల పతనం: 1-0, 2-16, 3-40, 4-45, 5-50, 6-68, 7-68, 8-70, 9-72, 10-74. బౌలింగ్‌: అర్ష్‌దీప్‌ 2-0-14-2, బుమ్రా 3-0-17-2, వరుణ్‌ 3-1-19-2, అక్షర్‌ 2-0-7-2, హార్దిక్‌ 2-0-16-1, దూబే 0.3-0-1-1.


1

మూడు ఫార్మాట్లలోనూ వంద వికెట్లు పూర్తి చేసిన ఏకైక భారత బౌలర్‌గా బుమ్రా. ఓవరాల్‌గా ఐదో బౌలర్‌. అలాగే అర్ష్‌దీప్‌ తర్వాత టీ20ల్లో 100+ వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలిచాడు.

1

భారత్‌ తరఫున టీ20ల్లో వేగంగా వెయ్యి పరుగులు పూర్తి చేసిన యంగెస్ట్‌ బ్యాటర్‌ (23 ఏళ్లు)గా తిలక్‌ వర్మ. అభిషేక్‌ (25)ను అధిగమించాడు.

1

టీ20ల్లో తమ అత్యల్ప స్కోరు (74) నమోదు చేసిన దక్షిణాఫ్రికా.

4

టీ20ల్లో ఎక్కువ సిక్సర్లు (100) బాదిన నాలుగో భారత బ్యాటర్‌గా హార్దిక్‌. రోహిత్‌ (205), సూర్య (155), విరాట్‌ (124) ముందున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

థాయ్‌లాండ్‌లో కనిపించిన గౌరవ్ లూథ్రా

ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీం విచారణ.. రేపటికి వాయిదా

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 10 , 2025 | 05:56 AM